భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది.వారి మధ్య ఉండే అనుబంధం ప్రేమ కొన్ని కోట్లతో సమానం.అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అది కనపడటం లేదు.ప్రతి దానికి కొట్టుకోవడం విడాకులు తీసుకోవడం లేదా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూసిన ఒక భర్త తన భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. భార్య మీద నిఘా పెట్టించాడు.మరి తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చుడండి.
పశ్చిమ ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.ఆమె ఎక్కడికి వెళ్తోంది? ఎవరెవరిని కలుస్తోందీ తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను సంప్రదించాడు. దీంతో ముగ్గురు డిటెక్టివ్‌లు రంగంలోకి దిగారు. బిజినెస్‌మ్యాన్ భార్యపై నిఘా పెట్టిన డిటెక్టివ్‌లు ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. ఆమె పనిచేస్తున్న ఆఫీస్ మాత్రమే కాకుండా.. షాపింగ్ మాళ్లు, మార్కెట్, కాఫీ షాప్, రెస్టారెంట్.. ఇలా ఆమె ఎక్కడికెళ్తే అక్కడికి నీడలా ఫాలో అయ్యారు. కొద్ది రోజులుగా అదే ముగ్గురు వ్యక్తులు తనకు తరచూ తారసపడుతుండటంతో మహిళకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె రివర్స్‌లో నిఘా ప్రారంభించింది. వాళ్లు కావాలనే తనను ఫాలో అవుతున్నారా? యాదృచ్చికంగా జరిగిందా? తనను ఫాలో అయితే.. ఏంచేద్దామనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన సోదరుడికి ఫోన్ చేసి విషయం వివరించింది. అర్జెంటుగా ఓ చోటుకి రావాలని కోరింది.
తన సోదరుణ్ని వెంటనే రమ్మని చెప్పిన సదరు మహిళ ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌కు బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకునే లోపే సోదరుడు వచ్చి ఓ చోట నిల్చున్నాడు. ఇంతలో ఆమెను ఫాలో అవుతున్న వ్యక్తులు కూడా రానే వచ్చారు. దూరం నుంచి వాళ్లను గమనించిన మహిళ.. సోదరుడికి సమాచారం అందించి నేరుగా ఓ కాఫీ షాప్‌లోకి వెళ్లింది. ఆమె వెనకాలే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కాఫీ షాప్‌లోకి వెళ్లారు. ఒకే కాఫీ ఆర్డర్ చేసి తాగడం ప్రారంభించారు. ఇక లాభం లేదనుకున్న మహిళ వాళ్లు తనకోసమే వచ్చారని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో ముగ్గురు వ్యక్తులు షాకింగ్ విషయాలు చెప్పారు. తాము ఓ ప్రైవేట్ డిటెక్టివ్ కంపెనీకి చెందిన ఉద్యోగులమని సదరు మహిళపై స్వయంగా ఆమె భర్తే తమతో నిఘా పెట్టారని పోలీసులతో వారు చెప్పారు. దీంతో ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా అతను నిజం ఒప్పుకున్నాడు. చూశారుగా ఈ భర్త భార్య మీద అనుమానంతో ఎంతటి పనిచేశాడో. ఇలాంటి ఘటనలు వింటుంటే అసలు భార్యాభర్తల బంధం ఎక్కడికి వెళ్తుందో అని అనిపించకమానదు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భార్య మీద నిఘా పెట్టించింది ఈ భర్త గురించి అలాగే సమాజంలో రోజురోజుకు తగ్గిపోతున్న భార్యాభర్తల సంబంధాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.