తెలుగులో వచ్చిన దృశ్యం సినిమా మనలో అందరు చూసే ఉంటారు. కూతురు జీవితాన్ని కాపాడటం కోసం ఒక తండ్రి పడే ఆవేదననే ఆ సినిమా. ఒకరిని చంపి ఆ కేసు వారి మీదకు రాకుండా ఒక తండ్రి ఎలాంటి ప్లాన్ వేశాడో తెలిపే కథ. సినిమా కథనం అద్భుతంగా ఉంటుంది అందుకే పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా హిందీ తమిళ్ లో కూడా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. అయితే సినిమాలను చూసి జనాలు ప్రభావితం అవుతారని విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ దృశ్యం సినిమా చూసి ఒక బీజేపీ నేత అదే తరహాలో ఓ 22 ఏళ్ల మహిళను హత్య చేశాడు. రెండేళ్లుగా ఈ నిజాన్ని సమాధి చేయాలని చూశాడు. కానీ పోలీసులు అతని గుట్టును రట్టు చేశారు.మరి ఆ నిజ జీవిత దృశ్యం కథ గురించి పూర్తీగా తెలుసుకుందామా.
ఇండోర్‌కు చెందిన ట్వింకిల్ దాగ్రే(22) అనే మహిళ రెండేళ్ల క్రితం అదృశ్యమైంది. కానీ.. ఈ కేసును విచారించిన పోలీసులకు ఆమెది హత్యగా తేలింది. ఈ హత్య చేసింది బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీష్ కరసియా, అతని ముగ్గురు కొడుకులని తెలిసింది. ద్రిశ్యం సినిమా చూసి హత్య చేసినట్లు నిందితులే స్వయంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్లుగా మిస్టరీగా మారిన ఈ కేసు గుట్టు శనివారం సాయంత్రం ఎట్టకేలకు వీడింది. బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీష్ కరోటియా(65)కు, ట్వింకిల్ దాగ్రేకు వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ వివాహేతర సంబంధం విషయంలో జగదీష్ కరోటియాకు, అతని ముగ్గురు కొడుకులకు మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి కొడుకులతో కలిసి జగదీష్ ట్వింకిల్ హత్యకు ప్లాన్ చేశాడు.
జగదీష్(65), అతని కొడుకులు అజయ్(36), విజయ్(38), వినయ్(31) అందరూ కలిసి ద్రిశ్యం సినిమా చూశారు. ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్‌ను ఆదర్శంగా తీసుకుని ట్వింకిల్‌ను హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని కాల్చివేశారు. ఓ ప్రదేశంలో ఓ కుక్కను చంపేసి పూడ్చి పెట్టారు. ఎవరో మనిషిని పూడ్చిపెట్టారనే పుకారు సృష్టించారు. పోలీసులు జాగిలాలతో వెళ్లగా ఓ దగ్గర వాసన పసిగట్టాయి. అక్కడ తవ్వగా.. వీళ్లు పూడ్చి పెట్టిన కుక్క కళేబరం కనిపించింది. కేసును ఇలా రెండేళ్ల పాటు పక్కదోవ పట్టించారు. కానీ ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఖననం చేసిన దగ్గర ట్వింకిల్ బ్రాసిలైట్, ఆభరణాల దొరికాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.చూశారుగా ఈ బిజెపి నేత కొడుకులతో కలిసి చంపి రెండేళ్లుగా కేసును ఎలా పక్కదోవ పట్టించారో. మరి ఈ బిజెపి నేత మర్డర్ కేసు నుంచి తప్పించుకోడానికి చేసిన స్క్రీన్ ప్లే గురించి అలాగే ఇలా సినిమా ద్వారా ఇన్స్పైర్ అయ్యి దారుణాలకు ఒడిగట్టే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.