మనం దూర ప్రయాణం చెయ్యాలంటే ఎంచుకునేది ఎక్కువగా రైలు ప్రయాణాన్నే.ఎందుకంటే ఇతర వాటి కంటే రైలు ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి.దేశం మొత్తం ఎక్కడికైనా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఛాయిస్ రైలుకు ఇస్తాం.అంతేకాకుండా ట్రైన్ జర్నీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది.అయితే అవే ట్రైన్ జర్నీలు ఒక్కొక్కసారి ప్రాణాంతకరంగా మారుతాయి.ఇంతకముందు దసరా రోజున అమృత్ సర్ రైలు ప్రమాద ఘటన గురించి మన అందరికి తెలుసు. ఎంతో మంది జనాలు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరొక రైలు ప్రమాదం జరిగింది.
బీహార్ రాష్ట్రంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఏడుగురు మృతి చెందారు.సోన్పూర్ డివిజన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రమాదానికి గురైన రైలు ఆదివారం వేకువజామున గం.3.52 నిమిషాలకు మెహ్‌నార్ దాటిన అనంతరం దాటింది. ఆ తర్వాత గం.3.58 నిమిషాలకు షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు స్లీపర్ కోచ్‌లు (ఎస్8, ఎస్9, ఎస్10)లు, ఒక జనరల్ కోచ్, ఒక ఏసీ (బీ3) కోచ్ సహా మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
విషయం తెలియగానే అధికారులు, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోన్పూర్, బారౌనీ ప్రాంతాల నుంచి వైద్యులు ప్రమాదస్థలికి వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. సోన్పూర్ – 06158221645, హజీపూర్ – 06224272230, బరౌనీ – 06279232222 నంబర్లను అందుబాటులో ఉంచారు.. రైలు ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ఈ రైలు ప్రమాద ఘటన గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకున్న ప్రమాద ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.