కులం కూడు పెట్టదు, మతం మనిషిని ఏమీ బాగుచెయ్యదు… కులమైనా -మతమైనా అభిమానం ఉండాలి అంతేకాని ఆరాధన ఉండకూడదు. కాని కొందరు మూర్ఖులు మాత్రం ఇలా కులాలకు మతాలకు మనుషుల కంటే ఎక్కువ విలువ ఇస్తారు.. అంతేకాదు కులం మతం చాలు అని భావిస్తారు . జీవితంలో మనిషి కంటే కులానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇలాంటి వారి వల్ల సొసైటీలో హత్యలు ఆత్మహత్య ఉదంతాలు చాలా జరుగుతున్నాయి.
మిర్యాలగూడలో ప్రణయ్ ని హత్య చేసిన ఉదంతం ఎవరూ మర్చిపోలేరు.. ప్రేమ వారిపాలిట శాపం అయింది.. కత్తివేటు అతని ప్రాణాలను హరించింది.. సుపారి గ్యాంగుని ఏర్పాటుచేసి రియల్ ఎస్టేట్ మాఫీయా గుండాలతో కలిసి అమృత తండ్రి అత్యంత పాశవికంగా పెరుమాళ్ల ప్రణయ్ ని హత్య చేయించాడు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. అంతేకాదు ఆ కుటుంబం నుంచి ప్రణయ్ కుటుంబానికి అమృతకు హానీ ఉంది అని కంప్లైంట్స్ రావడం , పోలీసులు కూడా వారికి భద్రత కల్పించారు. అయితే అమృత ప్రణయ్ చనిపోయే సమయానికి ఐదు నెలల గర్భిణీ.. ఇప్పుడు అమృత పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో ప్రణయ్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. హైదరాబాద్ లోని ఓ హాస్పటల్ లో అమృతకు ఓ పండండి మగబిడ్డ పుట్టాడు, ఇది మీడియాలో రావడంతో అందరికి తెలిసి మళ్లీ ప్రణయ్ పుట్టాడు అని సంతోషించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అయితే ఇక్కడ హాస్పటల్ సిబ్బందితో కుమ్మక్కై ప్రణయ్ బిడ్డని చంపాలి అని మారుతిరావు ప్లాన్ వేశాడు అని కొందరు చర్చించుకున్నారు.. ఇక ప్రణయ్ వారసత్వం ఉండకూడదు అని అమృత కడుపులో ఉన్న బిడ్డని కూడా తొలగించాలి అని మారుతిరావు కోరుకున్నాడట, అందుకే ఇక్కడ ఆస్పత్రిలో ఉన్నాకొందరు సిబ్బందితో అమృత బిడ్డని అంతం చేయాలి అని ప్లాన్ వేశాడు అని, కాని ఇది జరగదు అని అక్కడ వారు తెలియచేశారట. అయితే ఈ వార్తలు వాస్తవం కాదు అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం నిజం అంటున్నారు. చెట్టంత ఎదిగిన ప్రణయ్ ని చంపాడు ఇలా పసివాడి మీద కూడా ఆ కుటుంబం పగ తీర్చుకుంటుంది అని, అందుకే ప్రణయ్ కుటుంబం అమృతని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని కోరుతున్నారు జనం. సొంత అల్లుడ్ని చంపిన వాడు చిన్నారిపై కత్తి ఎత్తడు అని గ్యారంటీ ఏమిటి. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని కోరుతున్నారు అమృత మేలు కోరేవారు.