ఆడవారిని లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు.ఆడపిల్ల ఒంటరిగా ఉంటె చాలు వారిని లొంగదీసుకోవాలని అనుకుంటారు. ఆడవారిని శారీరకంగా ఉపయోగించుకోవాలని అనుకుంటారు.అయితే ఎవరైనా అలా చేస్తే ఆడవారు ఏం చెయ్యాలి. వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. లేదా వేరే ఏదైనా చెయ్యాలి. కానీ ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఒక లేడి టెక్కీ దారుణానానికి ఒడిగట్టింది. మరి ఏం చేసిందో తెలుసుకుందామా.
హైదరాబాద్ లో నివసించే 23 ఏళ్ల కార్పెంటర్ సాయి కుమార్ అనే కుర్రాడు కొద్ది రోజుల క్రితం ఈ లేడీ టెక్కీని చూశాడు. చూడటంతోనే ఆమెను ఎలాగైనా వశపరచుకోవాలనుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ ను సాధించాడు. ఇక అప్పటినుంచి ఆమెను ఫోన్లో వేధిస్తున్నాడు. నాకు కలవాలని ఉందని, ఓసారి కలుద్దామని ఆమెకు పదేపదే ఫోన్లు చేసేవాడు. నువ్వు ఎవరు అని ఎందుకు ఫోన్ చేస్తున్నావని ఆ టెక్కీ యువతీ అడిగితే అంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు. రోజు అతను ఫోన్ చేస్తుండటంతో సదరు లేడీ టెక్కి విసిగిపోయింది. దీంతో అతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్లాన్ వేసింది. సరే కలుస్తా అని చెప్పి ఆ యువకుడిని సికింద్రాబాద్ లో ఒక ప్రాంతానికి రమ్మని చెప్పింది. అయితే అప్పటికే జరిగింది తన స్నేహితులకు చెప్పి వారితో కలిసి సికింద్రాబాద్ వెళ్ళింది. ఎంతో ఆశతో వచ్చిన ఆ కుర్రాడికి అక్కడ షాక్ తగిలింది. ఆ లేడి టెక్కీ తన ఐదుగురు స్నేహితులతో రావడం చూసి అతను భయపడ్డాడు. ఆ తరువాత ఆ యవకుడిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అతనిని కొట్టించింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అతను వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చాడు. తీవ్ర గాయాలు అవ్వడంతో నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లేడీ టెక్కిని అదే రోజు అరెస్టు చేశారు. ఆమెను విచారించి మిగతా స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సదరు లేడీ టెక్కీ ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తోంది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ… గత కొద్ది రోజులుగా సాయి ఆమెను వేధిస్తున్నాడని, దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు కిడ్నాప్ చేశారని చెప్పారు. లేడీ టెక్కీ, ఆమె స్నేహితులు.. సాయిని బైక్ పైన ఎత్తుకెళ్లారని, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారన్నారు. కర్రలతో కొట్టారని చెప్పారు. చూశారుగా ఈ లేడి టెక్కీ ఎంతటి పని చేసిందో. మరి ఈ ఘటన గురించి అలాగే తప్పు చేశారని వారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి దారుణాలకు పాల్పడేవారు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.