సమాజంలో స్త్రీలను ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరు కొంతమంది మగాళ్లు.ఆడపిల్లగా ఎందుకు పుట్టాం అని ఆడపిల్లలు భయపడే స్థితికి వచ్చేశారు.ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అలా ఉన్నాయి మరి.ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి.వారిని లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు.స్త్రీ బయట అడుగుపెట్టాలంటేనే ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి.బయటవాళ్ళ నుంచే అనుకుంటే సొంత వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు అలంటి సమస్య ఎదుర్కొంటున్న ఒక మహిళ తన సమస్యను మనతో చెప్పుకుంది. మరి ఆమె సమస్య ఏమిటో దానికి మేము ఇస్తున్న సొల్యూషన్ ఏమిటో చూద్దామా.
నా పేరు రాణి.మాది పేద కుటుంబం. మా అక్కను మంచి ఉద్యోగం ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాం. మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అక్క, బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా. అయితే, ఓ రోజున మా అక్క ఇంట్లోలేని సమయంలో మా బావ గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆయన పట్టు నుంచి నేను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్లీజ్ నా కోర్కె తీర్చు… బాగా చదివిస్తాను, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు.అయినప్పటికీ నేను అంగీకరించలేదు. ఐతే అక్క లేనప్పుడు గబుక్కున వచ్చి వాటేసుకుంటున్నాడు. ఇంకా ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఐతే నేను ఎలాగో తప్పించుకుంటున్నాను. కానీ ఏదో ఒకరోజు నాపై అఘాయిత్యం చేస్తాడని భయంగా వుంది. ఒకవేళ మా అక్కను చెబుదామంటే ఆమె కాపురం నాశనం అవుతుందేమో అని భయంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా సమస్యకు సొల్యూషన్ చెప్పండి.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
సమాధానం : అర్జెంటుగా ఆ ఇంటిని వదిలి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోండి. లేనిపక్షంలో ఏదో ఒక రోజున మీరు అనుమానిస్తున్నట్లే జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేశారు కాబట్టీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మీ తల్లిదండ్రులను పోషించుకోండి. ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకుని కొంతమంది ఇలా ప్రవర్తిస్తుంటారు. జాగ్రత్తగా వుండాలి.ఒకవేళ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి వీలుకాకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా హాస్టల్ లో ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోండి. అప్పుడు మీకు ఆర్థిక సమస్య ఉండదు మీ చదువు డిస్టర్బ్ అవ్వదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విన్నారుగా ఆ అమ్మాయి సమస్య దానికి మేము ఇచ్చిన సొల్యూషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.