ఎన్ని చట్టలొచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు.ప్రపంచంలో ఎటుచూసినా మహిళలపై కామాంధుల అత్యాచారాలు శృతిమించిపోతున్నాయి. రోజూ ఏదో ఒక ఘటన బయటపడుతూనే ఉంది.సిటీలు పల్లెలు అనే తేడా లేకుండా దేశం నలుమూలల ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు పశువుల్లా మీదపడిపోతున్నారు కొందరు మృగాళ్లు. వావి వరసలు మర్చిపోయి ముక్కుపచ్చలారని పసివాళ్ల నుంచి పండు వృద్ధుల వరకు ఎవర్నీ వదలడం లేదు.అయితే బయటవాళ్ళ నుంచే అనుకుంటే ఇప్పుడు సొంతవాళ్ల నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది. తెలిసిన వాడే కదా అని నమ్మి వెళ్లిన యువతీ జీవితాన్ని నాశనం చేశాడు ఆమె దుర్మార్గుడు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్ళడానికి బస్సు స్టాప్ వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన మేకల నరేష్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెను కలిశాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే కరీంనగర్ వెళ్తున్న అని ఆ యువతీ చెప్పింది. నేను కూడా కరీంనగర్ వెళ్తున్న అని చెప్పి బైక్ ఎక్కు కరీంనగర్ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. తెలిసిన వాడే కదా అని ఆ యువతీ బైక్ ఎక్కింది. బైక్ మీద వెళ్తూ ఆమెతో మాయ మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు.మంచిగా మాట్లాడుతున్నట్టే నటించాడు. తెలిసినవాడే కదా అని ఆ యువతీ మాటల్లో పడిపోయింది. అయితే ఇదే అదునుగా భావించి కరీంనగర్ వెళ్లేదారిలోనే ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి అనుమానం వచ్చి ఇటు ఎందుకు వెళ్తున్నావు అంటే షార్ట్ కట్ రూట్ అని చెప్పాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అప్పుడు ఆ యువతీ అతనిని నమ్మింది. అదే ఆ యువతీ చేసిన తప్పు. ఆ తర్వాత కొక్కెరకుంట ప్రాంతంలో అడవిలాగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేశాడు. కాపాడండి అని ఎంత గట్టిగా అరిచినా అడవి ప్రాంతం కావడంతో ఎవరు రక్షించలేకపోయారు. ఈ విషయం ఎవరి దగ్గర అయినా చెబితే నీ పరువే పోతుంది. కాబట్టి జరిగింది మర్చిపో అని ఆ యువతిని బెదిరించాడు. అయితే ఆ యువతీ దైర్యం తెచ్చుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. జరిగింది అంతా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి అతని కోసం వెతుకుతున్నారు.. చూశారుగా నమ్మి వెళ్తే ఎంతటి దారుణానికి ఒడిగట్టారో. మరి ఈ దారుణ ఘటన గురించి అలాగే సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచార ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.