ప్రేమికుల కామకలాపాలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల మెట్రో స్టేషన్లలో హద్దు మీరి ప్రవర్తిస్తోంది యువత. ఇప్పుడు అదే సంస్కృతి హైదరాబాదు మెట్రోకు కూడా పాకింది. కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రేమికులు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మెట్రో లిఫ్టులో ప్రేమ జంట ముద్దు పురాణం బయటపడింది. వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో పలువురు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో కూడా అసాంఘీక కార్యకలాపాలకు వేదికవుతోంది. ఇప్పటి వరకు సంస్కృతి ముంబై ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఇందులో మెట్రో నిర్వాహకులది కానీ, యాజమాన్యానిది కాని తప్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒకరిద్దరూ అసభ్యంగా ప్రవర్తించడం మన మెట్రోకు మచ్చ తీసుకొస్తోంది. అత్యాధునిక వసతులు, అత్యంత భద్రతతో కూడిన మెట్రో స్టేషన్లలో యువత హద్దు మీరుతోంది. ఓ యువ జంట మెట్రో స్టేషన్ లిఫ్టులో ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటున్న వీడియో ఒకటి బయటకు పొక్కింది. ఇంకేముందు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవడం వెంటనే చక్కర్లు కొట్టడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.
నిత్యం కిటకిటలాడే మెట్రో స్టేషన్లలో యువత ఇలాంటి కామకలాపాలకు పాల్పడటంపై పలువురు మండిపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని మెట్రో స్టేషన్లలో యాజమాన్యం బోర్డు పెట్టినప్పటికీ కూడా వాటిని విస్మరించి తమ పని తమదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది యువత. మెట్రో లిఫ్టులో చాలామంది ఎక్కుతుంటారు దిగుతుంటారు. అదే జరిగింది నిన్న బయట పడిన వీడియోలో. ఆ యువ జంటను చూస్తే కాలేజీ విద్యార్థుల్లా ఉన్నారు. సాధారణంగా లిఫ్టు ఎక్కగానే అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్‌లో కానీ దిగాల్సి ఉంటుంది. లిఫ్టులో ఎక్కిన ప్రతి ఒక్కరు దిగుతున్నారు.. లేదా ఎక్కుతున్నారు. కానీ ఈ ప్రేమ జంట మాత్రం లిఫ్టు నుంచి బయటకు వెళ్లలేదు. లిఫ్టులో ఎవరూ లేని సమయంలో ముద్దుపై ముద్దు పెడుతూ నాన్‌స్టాప్ కిస్సింగ్ సీన్‌ను తలిపించారు. కనీసం సీసీ కెమరాలు ఉన్నాయన్న సంగతిని కూడా మరచి వారు చుంబనంపైనే దృష్టి పెట్టారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
మెట్రో స్టేషన్లలో ఏం జరిగినా… ఉప్పల్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలుస్తుంది. ఈ అధర చుంభనం దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. అయితే ఇది ఏ మెట్రో స్టేషన్లో జరిగిందో ఇంకా తెలియరాలేదు. యువత జాగ్రత్తగా ఉండాలంటూ మెట్రో అధికారులు సూచిస్తున్నారు. పలువురు తిరిగే చోట ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై విచారణ చేపడతామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.