సమాజంలో స్త్రీలు ఎన్ని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం.ప్రతి ఒక్కడు ఆడపిల్లను కామంతో చూసేవాడే ఉన్నాడు.ఆడపిల్ల కనపడితే లైంగికంగా ఎలా వేదిద్దాం అనే ఆలోచనలోనే ఉంటారు.సరే బుద్దిలేని వాళ్ళు ఏడిపిస్తే చుట్టూ ఉన్నవాళ్లు ఎవరైనా వారిని అడ్డుకుంటారా అంటే అస్సలు అడ్డుకోరు.మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్నది అనడానికి ఇప్పుడు నేను చెప్పే ఘటనే ఉదాహరణ.మరి ఏమైందో చూద్దామా.
వాళ్లంతా అమ్మాయిలు. సరదాగా అంతా కలిసి మెట్రో ట్రైన్ ఎక్కారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వారికి ఎదురుగా కూర్చున్నారు. చేతిలో మొబైల్ పట్టుకొని వారిని షూట్ చేస్తున్నారు. అతని వ్యవహారంపై అమ్మాయిలకు అనుమానం వచ్చింది. మెట్రో ట్రైన్ కున్న గ్లాస్‌లో అది రిఫ్లక్ట్ అవ్వడంతో అతడు తమనే షూట్ చేస్తున్నాడని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన చెన్నై మెట్రో రైల్లో జరిగింది. కొంతమంది అమ్మాయిలు కొయంబెడు నుంచి చెన్నై ఎయిర్ పోర్టు వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కారు. దీంతోవారికి ఎదురుగా సీట్లో కూర్చున్న వ్యక్తిని అమ్మాయిల్న అదేపనిగా షూట్ చేయడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన అమ్మాయిలు అతగాడ్ని నిలదీశారు. దీంతో అతడు ఇచ్చిన సమాధానం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. మీరు పొట్టిపొట్టిగా, అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకోవడంతోనే నేను ఫోటోలు తీస్తున్నానంటూ సమాధానమిచ్చాడు.
దీంతో వడపలాని స్టేషన్ వద్ద మెట్రో కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేశారు అమ్మాయిలు. దీంతో పోలీసులు సదరు ఫోటోలు తీసిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. అతడి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని ఫోన్‌లో ఆ అమ్మాయిల అసభ్యరమైన ఫోటోల్ని, వల్గర్ వీడియోల్ని గుర్తించారు. నిందితుడు దినేష్ అనే వ్యక్తిగా గుర్తించారు. అన్నానగర్‌లో నివసిస్తున్న ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దీంతో దినేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతడి సెల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. మరోవైపు చెన్నై మెట్రోలో ఇప్పటివరకు సీసీటీవీ కెమెరాల్ని, పాసింజర్ ఎమర్జెన్సీ ఇంటర్ కామ్స్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో చాలామంది చెన్నై మెట్రో రైళ్లలో తరచూగా ప్రయాణం చేయడం లేదు. ఇప్పుడు చెన్నై కార్పొరేషన్ సబర్బన్ రైళ్లలో, లేడీస్ కంపార్టమెంట్‌లలో మహిళల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.చూశారుగా ఈ వ్యక్తి ఆడపిల్లలను ఎలా ఫోటో తీశాడో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.