భారత్ పాక్ మధ్య యుద్ద మేఘాటు కమ్ముకున్నాయి ఒకరిపై మరొకరు యుద్దానికి సిద్దంగా కాలుదువ్వుతున్నారు ఈ సమయంలో ముందు స్టెప్ ఎవరు వేస్తే వారే యుద్దానికి సమర శంఖం పూరించిన వారు అవుతారు ఈ సమయంలో భారత్ సర్జికల్ స్ట్రైక్ చేయడంతో వారు దిక్కుతోచని స్దితిలో ఉన్నారు.. అయితే సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ పాక్ కు ధీటైన జవాబు ఇచ్చింది మీకు చేతకాకపోతే మేమే ఉగ్రవాదులను చంపుతాం ఉగ్రశిబిరాలు నాశనం చేస్తాం అని సమాధానం ఇచ్చింది. అయితే ఆనందకరమైన ఈ సమయంలో ఓ విషాదం చోటు చేసుకుంది ఆర్మీ గ్రూపులో.
మధ్య కశ్మీర్‌లోని బుడ్గామ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఫైటర్ జెట్ ప్రమాదానికి గురయ్యింది. ఇద్దరు పైలట్లు చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ అధికారులు… ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. బాలాకోట్‌లో మెరుపు దాడి నేపథ్యంలో భారత వాయుసేనపై సర్వత్రా ప్రశంల వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ప్రమాదం జరగడం బాధాకరమంటున్నారు ఆర్మీ అధికారులు. ఈ ఆనందకర సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని అనుకోలేదని అంటున్నారు ఆర్మీ అధికారులు, అయితే వారి కుటుంబాలకు మన ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలియచేశారు, అయితే జెట్ రాకెట్స్ ఇలాంటి వాటిని ఇప్పుడు యుద్ద సన్నాహాల కోసం మళ్లీ వర్క్ చేయిస్తున్నారు. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు ఆ తర్వాతే వాటిని ప్రయోగిస్తున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
మరో వైపు పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది సర్జికల్ స్ట్రైక్ 2తో పాక్ లోని ఉగ్రశిబిరాలను నేలమట్టం చేశారు భారత వైమానిక దళం, దాదాపు 300 మంది సైనికులను తుదిమెట్టించారు భారత సైన్యం. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. పాక్‌లోని బాలాకోట్‌పై భారత్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పలు స్థావరాలతో పాటు జైషే కమాండ్ కంట్రోల్ రూమ్ నామ రూపాల్లేకుండా నాశనమైంది. 300 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు, ఇక చెప్పుదెబ్బ తిన్న పాక్ ఇక్కడ జరిగిన ఉగ్రవాదులుపై దాడి అంశంలో వారి పుటేజీని ఆ సాక్ష్యాలను కూడా లేకుండా జాగ్రత్తపడుతోంది.