Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

హైద‌రాబాద్ లో హై అల‌ర్ట్ ఈ ప్రాంతాల్లో జాగ్ర‌త్త‌గా ఉండండి దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం

$
0
0

ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రగల్భాలు పలికిన పాక్.. మన వైపునుంచి ఇలాంటి అటాక్ ఉంటుందని ఊహించలేకపోయింది. మిరాజ్ 2000 యుద్ధవిమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించిన సైన్యం ఉగ్రవాద స్థావరాలపై బాంబుల మోత మోగించి 300 మంది ఉగ్రవాదులను హతమార్చింది. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పారంటూ ప్రజలంతా సైన్యాన్ని కొనియాడుతున్నారు.

Related image

అయితే ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్థాన్ భావిస్తూ అసహనంతో రగిలిపోతోంది. దీంతో నిన్నటి నుంచి సరిహద్దు వెంబడి భారత జవాన్లపైకి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్రం అనుమానిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటుచేసింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని దిల్లీ తర్వాత అత్యధిక సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నది హైదరాబాద్‌లోనే. దీంతో డీఆర్‌డీవో ప్రయోగశాలలు, రక్షణోత్పత్తుల పరిశ్రమలు, నగరం చుట్టుపక్కల ఉన్న సైనిక, వాయుసేన శిబిరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

దేశంలో ఉగ్రవాదులు ఎలాంటి దాడులు చేయాలన్న ఫస్ట్ టార్గెట్ హైదరాబాదే ఉంటుంది. దీంతో దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలు ఇక్కడే ఉండటం సాధారణంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు భాగ్యనగరాన్నే ఎంచుకునే అవకాశం ఉండొచ్చన్న అనుమానంతో భద్రతను పటిష్టం చేశారు. రక్షణ శాఖకు చెందిన అనేక సంస్థల వద్ద సెక్యూరిటీ భారీగా పెంచారు. ఇక ఇక్క‌డ అబిడ్స్ కోటీ మార్కెట్ , సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్, నాంప‌ల్లి స్టేష‌న్ ,ఎంజీబీఎస్, జూబ్లీ బ‌స్టాప్, అమీర్ పేట్, ప‌లు షాపింగ్ మాల్స్ వ‌ద్ద భ‌ద్ర‌త మ‌రింత పెంచారు అలాగే చార్మినార్, గోల్కొండ కోట ద‌గ్గ‌ర కూడా పెద్ద ఎత్తున బ‌ల‌గాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఉండ‌ద్దు అని చెబుతున్నారు


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles