Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

Breaking News : అభినందన్ పై సంచలన వార్త విడుదల చేసిన పాకిస్తాన్ పత్రిక…షాక్ లో భారత్

$
0
0

పాకిస్థాన్‌లోని ప్రముఖ వార్తాపత్రిక ‘డాన్’ భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌కు సంబంధించి ఓ వార్తను ప్రచురించింది. అభినందన్‌ను అదుపులోకి తీసుకునే ముందు జరిగిన పరిణామాలు ఇవేనని చెప్పుకొచ్చింది. ‘డాన్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్‌ఓసీకి సరిగ్గా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8:45 నిమిషాల సమయంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు మంటల్లో కాలిపోవడం తాను చూశానని 58 ఏళ్ల వయసున్న మహ్మద్ రజాక్ తెలిపినట్లు ‘డాన్’ పత్రిక రిపోర్ట్ చేసింది. కాలిపోతున్న ఓ విమానం నుంచి పారాచ్యూట్‌లో ఓ వ్యక్తి తన ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కిందకు దిగడం తాను చూశానని చెప్పుకొచ్చారు. గ్రామంలోని కొందరు యువకులను వెంట తీసుకెళ్లి అక్కడికి వెళ్లి చూడగా ఓ పైలట్ కనిపించినట్లు మహ్మద్ రజాక్ తెలిపాడు.

Image result for abhinandan

యువకులను అతని దగ్గరకు వెళ్లవద్దని, సైన్యం వచ్చే దాకా వేచి చూద్దామని తాను చెప్పినట్లు మహ్మద్ రజాక్ తమ పత్రికకు ఫోన్‌లైన్‌లో తెలిపినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. తాను వెళ్లిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను, మ్యాప్‌లను మింగేందుకు ఆ పైలట్ ప్రయత్నించాడని రజాక్ చెప్పినట్లు తెలిసింది. పిస్టల్ చేతబుచ్చుకున్న ఆ పైలట్ ‘ఇది ఇండియానా లేక పాకిస్థానా’ అని స్థానిక యువకులను అడిగినట్లు రజాక్ చెప్పాడు. ఆ యువకుల్లో ఓ యువకుడు తెలివిగా వ్యవహరించి ‘ఇది ఇండియా’ అని అబద్ధం చెప్పాడని రజాక్ చెప్పినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. దీంతో పైలట్ అభినందన్ ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారట. దాహంగా ఉందని, నీళ్లు ఇవ్వాలని అభినందన్ కోరినట్లు తెలిసింది. అభినందన్‌ ఇండియాకు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న కొందరు యువకులు ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అని నినాదాలు చేశారట. దీంతో.. అభినందన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు ‘డాన్’ పత్రిక చెబుతోంది. ఈ పరిణామంతో కంగుతిన్న యువకులు రాళ్లు చేతిలోకి తీసుకున్నారట.

ఈ క్రింది వీడియో చూడండి 

దీంతో.. అభినందన్ దాదాపు అర కిలోమీటరు వెనక్కి పరిగెత్తాడని, తనను వెంబడించిన యువకులకు పిస్టల్ చూపించి భయపెట్టాడని రజాక్ తమకు చెప్పినట్లు ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఈ పెనుగులాటలో అభినందన్ మరోసారి గాల్లోకి కాల్పులు జరిపాడట. జేబులో నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసి నీటిలో ముంచి నాశనం చేసే ప్రయత్నం చేశాడట. పిస్టల్ కింద పడేయాలని యువకులు కేకలు వేయగా.. ఓ యువకుడిని కాలిపై కాల్చాడని ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. అయితే.. ఇందులో నిజమెంత అనే విషయంలో స్పష్టత లేదు. ఎట్టకేలకు పిస్టల్ కింద పడేసిన అభినందన్‌ను పాక్ యువకులు చుట్టుముట్టారని అతనిపై దాడి చేశారని పాక్ సైన్యం వచ్చి అభినందన్‌ను కాపాడిందని ‘డాన్’ పత్రిక రిపోర్ట్ చేసింది.అయితే ఈ కథనం విని అందరు షాక్ అవుతున్నారు. మరి పాకిస్థాన్ పత్రిక విడుదల చేసిన ఈ కథనం గురించి అలాగే పాక్ ఆర్మీకి దొరికిన తర్వాత అభినందన్ చూపిన తెగువ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles