పుల్వామా ఉగ్రదాడి దరిమిలా చోటుచేసుకున్న పరిణామాలు.. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం తలపిస్తున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడిచేసిన ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే యుద్ధం వస్తే ఎలా ఉంటుందోనని రెండు దేశాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. యుద్ధం రాకూడదని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు ట్విట్టర్ లో.. #SayNoToWar హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. యుద్ధమంటూ మొదలైతే అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఊహించలేమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే.. నా చేతుల్లో గానీ, మోడీ చేతుల్లో గానీ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. అదలావుంటే ఇరు దేశాలకు చెందిన నేతలు తాజా పరిణామాలపై ప్రకటనలు చేస్తుండటంతో.. రెండు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అయితే పాకిస్థాన్ ఒకవైపు యుద్ధం వద్దంటూనే మరొకవైపు కవ్వింపు చర్యలను పాల్పడుతుంది. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్‌లో పాక్ రేంజర్లు గురువారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.ఈ కాల్పులు సుమారు గంటపాటు కొనసాగాయి. పాక్ సైన్యం కాల్పులు జరిపిన నేపథ్యంలో రాజౌరి జిల్లా మంజాకోటి సెక్టార్ లోనూ భారత జవాన్లు అప్రమత్తమయ్యారు. పాక్ కు ఎంత చెప్పినా బుద్ధి రాదనీ యుద్దానికి సై అంటుంది భారత్. పాక్ చేసే కవ్వింపు చర్యలకు బుద్ది చెప్పాలని మోడీ అనుకుంటున్నాడు. ఇందుకోసం మోడీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ఈ క్రింది వీడియో చూడండి
ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఇప్పుడు పాక్ ప్రధాని ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. మోడీ ఇస్తున్న షాక్ లకో లేక 20 ఏళ్ళు కష్టపడి ప్రధాని అయ్యా..నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని మనసులో టెన్షన్ పడుతున్నాడో తెలీదు కానీ ఇమ్రాన్ ఖాన్ కొంత అస్వస్థతకు గురయ్యాడు.ఈరోజు ఆయన రావల్పిండిలోని ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.ఆయనకు కొంచెం బిపి ఎక్కువయినట్టు తెలుస్తుంది.ఆయనకు బిపి టెస్ట్ లు చేసినట్టు సమాచారం. అయితే ఇమ్రాన్ ఖాన్ ఎక్కువగా ఆందోళనా చెందుతున్నాడని అందుకే ఆయనకు బిపి కొంచెం పెరిగినట్టు డాక్టర్స్ చెప్పినట్టు సమాచారం. ఆయన అస్వస్థతకు గురయ్యాడని తెలిసి పాకిస్థాన్ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది.కొంతమంది దేశ అధ్యక్షులు ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. పాక్ భారత్ మధ్య యుద్ధం వచ్చేటట్టు ఉన్న ఈ పరిస్థితిలో పాక్ ప్రధానికి ఇలా అవ్వడం కొంచెం ఆందోళన కలిగించే అంశమే. అయితే మోడీ ఇస్తున్న షాక్ లకు ఇమ్రాన్ ఖాన్ కు బిపి పెరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. మరి మీరేమంటారు. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు అలాగే ఇమ్రాన్ ఖాన్ కు బిపి పెరగడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.