నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు.
కాగా ఇటీవల నాగార్జున ఈ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని చూసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త ఇంట్లో నాగార్జున రీసెంట్ గా తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన ఓ సెలెబ్రిటీ నివాసంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని వీక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చూసేందుకు జనాలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.
ఎన్టీఆర్ బయోపిక్ వలన బయ్యర్లు దారుణంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. నిరాశ చెందలేదట జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగార్జున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చూసి నిరాశచెందలేదట. వాళ్ళు ఎంపిక చేసుకున్న వరకు చిత్రాన్ని బాగానే తీసినట్లు నాగార్జున అభిప్రాయపడ్డారట. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాకుడులో సినీరంగ విశేషాలు చూపించారు. మహానాయకుడులో రాజకీయ విశేషాలని ఎన్టీఆర్ సతీమణి మరణించేవరకు చూపించారు.
ఎన్టీఆర్ చివరి మజిలీని విస్మరించారు. అర్థంకాని విషయం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని బాగానే తీశారు. కానీ సావిత్రి బయోపిక్ ఎందుకు విజయం సాధించింది, ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకులని ఎందుకు నిరాశపరిచింది అనే విషయంలో నాగార్జున గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. గత ఏడాది విడుదలైన మహానటి చిత్రం తిరుగులేని విజయం సాధించింది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, నాగార్జునతో శివాజీ రాజా బిగ్ ప్లాన్.. 2019లో ఎలాగైనా! వెబ్ సిరీస్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం తర్వాత నాగార్జున ఏఎన్నార్ బయోపిక్ రూపొందించాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో ఈ విషయం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు కూడా నాగార్జున మౌనం వహించారు. కనీసం వెబ్ సిరీస్ రూపంలో అయినా ఏఎన్నార్ బయోపిక్ రూపిందించాలనే ఆలోచన నాగార్జునకు ఉండేదట. కానీ ఆ ఆలోచన నుంచి కూడా నాగ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.