మహేష్ సిరి ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. మహేష్ కు బ్యాంక్ జాబ్ వచ్చింది. కాల్ లెటర్ కూడా వచ్చింది. సిరి నర్సింగ్ ఫైనల్ ఇయర్ కు వచ్చింది. వీళ్లిద్దరి ప్రేమకథ ఇది. ఆరోజు సిరి బర్త్ డే. మహేష్ నీ కాల్ లెటర్ ఇంట్లో చూపించి మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తా.నా పుట్టినరోజు కానుకగా నిన్ను ఇచ్చి పెళ్లి చెయ్యమని చెప్తా అని మహేష్ కు చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్తుంది సిరి. కానీ సిరి మహేష్ అనుకున్నది ఆ దేవుడు జరగనివ్వలేదు. వారికి ఆపద కాలేజీ అటెండర్ రూపంలో వచ్చింది. అతను సిరిని మోహించాడు. అతనికి సిరి దక్కడం లేదని అక్కసుతో అక్కడికి వెళ్లే ముందే సిరి తండ్రిని కలిసి ఇలా చెప్పాడు. ఆ అటెండర్ సిరి వాళ్ళ నాన్నతో మీ అమ్మాయి మహేష్ అనే అబ్బాయి ఇద్దరు క్లోజ్ గా తిరుగుతున్నారు. ఇప్పుడు మీ అమ్మాయి ప్రెగ్నెంట్. దానిని పోగొట్టుకోడానికి అతను ట్యాబ్లేట్స్ తెచ్చి ఇచ్చాడు. మీ అమ్మాయి ఈరోజు వాటిని వేసుకోవడం నా కళ్లారా చూశాను అని ఒకటికి పది కల్పించి చెప్పాడు. ఏ తండ్రి అయినా కూతురి మీద ఇలాంటి మచ్చ పడితే సహించలేడు. కాలేజ్ నుంచి సిరి వచ్చిన వెంటనే దీని గురించి అడగడం సిరి ఎంత చెప్పిన నమ్మకపోవడం జరిగింది.నిజానికి మహేష్ కాల్ లెటర్ చూపించి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంది. కానీ ఇప్పుడు ఏం చెప్పినా ఇంట్లో వినేలా లేదు.
సొంత కూతురి మాటలు వినకుండా పక్కవారి మాటలు నమ్మి తనను తిట్టడం సిరి జీర్ణించుకోలేకపోయింది. నాకు ప్రెగ్నెంట్ రాలేదు కావాలంటే టెస్ట్ చేపించండి. నీకు నెల నెల కడుపునొప్పి వస్తుంది. అదే విధంగా ఒకసారి కాలేజీకి వెళ్ళాక నొప్పి లేస్తే మహేష్ కు కాల్ చేసి ట్యాబ్లేట్ తెమ్మని చెప్పాను. ఆటను తెచ్చి ఇచ్చింది వేసుకున్నా. మేము ప్రేమించుకున్నాం కానీ హద్దు దాటలేదు. నాకు టెస్ట్ చేపించండి అని సిరి తండ్రిని బ్రతిమాలాడింది. కానీ ఆమె మాటలు నమ్మకుండా కోపంగా వెళ్ళిపోయాడు. అబార్షన్ కోసం ఫామిలీ డాక్టర్స్ కు ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నాడు. దీంతో సిరి మనసు విరిగిపోయింది. రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని తండ్రికి ఇలా లెటర్ రాసింది.నాన్న మీరు నన్ను తిట్టారనో లేక అమ్మ కొట్టిందనో నేను బాధపడటం లేదు.కానీ మీరు నమ్మేముందు నా మాట ఎందుకు వినలేదు అని నేను బాధపడుతున్నా. పరాయివాడి మాట విని నమ్మిన నువ్వు నేను చెప్పింది ఒకసారి విని ఉంటె బాగుండు నాన్న. మహేష్ నేను ప్రేమించుకున్న మాట వాస్తవం. కానీ పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నేను చేసిన తప్పా. ఎందుకు నాన్న పిల్లల కంటే పరువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఈరోజు నా గురించి నీకు చెప్పిన వాడి మాట నిజమని నమ్మిన నువ్వు నేను నిజం చెప్పిన నమ్మలేని పరిస్థితిలో ఎందుకు లేవు నాన్న. కొన్నిసార్లు మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి. కొన్ని సమస్యలకు మనసు మాత్రమే పరిస్కారం చూపిస్తుంది.మీ కూతురికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చి ఉంటె మీ మనసు మీ మాట వినేదేమో.ఇప్పుడు నేను ఎన్ని చెప్పిన నువ్వు వినవు నాన్న. మహేష్ కు జాబ్ వచ్చింది. అతని కాల్ లెటర్ చూపించి నా బిర్ట్ డే గిఫ్ట్ గా నా పెళ్లి చెయ్యమని అడుగుదామనుకున్నా. కానీ నీ కూతురు ఏ తప్పు చెయ్యలేదు అని రేపు పోస్ట్ మార్టంలో నీకు తెలుస్తుంది. ఆయా రిపోర్ట్ లో అయినా సరే నాకు ప్రెగ్నెంట్ రాలేదని నీకు తెలుస్తుంది అని లెటర్ రాసి సిరి ప్రాణాలు తీసుకుంది.కూతురి మరణవార్త తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తర్వాత కూతురి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది.సిరి ప్రెగ్నెంట్ కాదు ఆమె చెప్పింది నిజమని తేలింది.సిరి చనిపోయిందని తెలుసుకుని ఆమె లేని జీవితం నాకు వద్దని మహేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.సిరి తండ్రి మాత్రం చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.చూశారుగా పరాయి వ్యక్తి మాటలు నమ్మినందుకు కూతురిని ఎలా పోగొట్టుకున్నాడో. కాబట్టి బయట వ్యక్తుల కంటే పిల్లల మాటలు ఒక్కసారి వినడం నేర్చుకోండి.మరి ఆ అమ్మాయి జీవితంలో జరిగిన దాని గురించి అలాగే ఇలా బయట వ్యక్తుల మాటలు నమ్మి సొంత వాళ్ళను దూరం చేసుకునే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.