సమ్మర్ వచ్చింది కదా అని AC లు వాడుతున్నారా.. .ఈ ఎండలకు వాడకుండా ఎవరు ఉండరనుకోండి. అయితే మీరు AC లు వాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఫామిలీ ఇలాగె ప్రాణాలు కోల్పోయింది. దిల్లీ సమీపంలోని గురుగ్రామ్ సెరా హౌసింగ్ సొసైటీలో ఉండే వాసు కూడా తమ పాత ఏసీని బయటకు తీశారు. దానికి మరమ్మతుల కోసం ఇద్దరు మెకానిక్‌లను తన ఇంటికి పిలిపించారు. మరమ్మతులు చేస్తుండగా ఆ ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఇద్దరు మెకానిక్‌లూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాసు కూడా తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. ఆ పక్కనే కూర్చున్న వాసు పిల్లలకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఆ ఇద్దరు మెకానిక్‌లకు ఏసీలను బాగు చేసే అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కొన్ని మీడియా ఛానెళ్లు పేర్కొన్నాయి. వారిని పంపించిన సంస్థ మాత్రం ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదు. ఈ ఘటన నేపథ్యంలో ఏసీ ప్రమాదాల అంశం చర్చనీయమైంది. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
జాగ్రత్తలు పాటిస్తే ఏసీ ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) ప్రొగ్రామ్ మేనేజర్ అవికల్ సోమ్‌వంశీ. కంప్రెషర్ ఎందుకు పాడవుతుందో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. మరమ్మతుల చేస్తున్నప్పుడే కాదు, మాములు సమయంలోనూ ఏసీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏసీ నుంచి లీక్ అయ్యే గ్యాస్ కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ గ్యాస్‌కు ఎలాంటి వాసనా ఉండదు. ఏసీ సరిగ్గా బిగించకపోయినా, గ్యాస్ సరఫరా అయ్యే కాయిల్స్ పాడైపోయినా, ఏసీ ట్యూబ్‌లు పాతవై తుప్పు పట్టినా గ్యాస్ లీక్ అవ్వొచ్చు. ఏసీ సరిగ్గా చల్లదనం ఇవ్వలేకపోతుంటే ఇవన్నీ గమనించాలి. ప్రతి సీజన్‌లోనూ ఏసీని సర్వీసింగ్ చేయించాలి. రోజులో ఒక్కసారైనా గది కిటికీలు, తలుపులు కాసేపు తెరవాలి. లేకపోతే కలుషిత గాలి బయటకు వెళ్లదు. ఆక్సీజన్ లోపలికి రాదు. నాణ్యమైన గ్యాస్‌నే వినియోగించాలి. లేకపోతే ప్రమాదాలు జరగొచ్చు. ఏసీ ఉష్ణోగ్రత 25-26 డిగ్రీ సెల్సియస్ ఉంటే చాలు. రాత్రి పూట ఇంకొంత తగ్గించుకోవచ్చు.

ఏసీ మరమ్మతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మెకానిక్‌కు అనుభవం ఉందో లేదో తెలుసుకోవాలి. ఎక్కడ శిక్షణ పొందారో కనుక్కోవాలి. పూర్తి అవగాహన లేకుండా మరమ్మతులు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మెకానిక్ వద్ద మరమ్మతులు చేసేందుకు అవసరమైన వస్తువులతో పాటు ప్రమాద నివారణ సామగ్రి ఉండేలా చూడాలి. మరమ్మతులు, గ్యాస్ ఫిల్లింగ్ వంటివి మూసి ఉన్న గదిలో కాకుండా, బయటి ప్రదేశంలో చేస్తే మేలు. ఏసీ మరమ్మతులు జరుగుతున్న చోట ఎక్కవ మంది ఉండకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. కొనేటప్పుడు పాటించాల్సినవి : స్ప్లిట్ ఏసీ కన్నా విండో ఏసీలకే మొగ్గు చూపండి. విండో ఏసీల నిర్వహణ సులభం. ప్రముఖ సంస్థల ఏసీలనే కొనుగోలు చేయండి. అవి వారంటీ ఇస్తాయి. సర్వీసింగ్ మెరుగ్గా ఉంటుంది. ఏసీలో నింపే గ్యాస్ నాణ్యత కూడా ఒక్కో సంస్థది ఒక్కోలా ఉంటుంది. అన్ని వివరాలూ తెలుసుకున్నాకే కొనండి. కాబట్టి ఊరికే AC వాడుతున్నామని కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరి AC వలన జరిగే ప్రమాదాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.