కృష్ణా రామ అని భజన చేస్తూ కూర్చోవాల్సిన వయస్సులో ఓ వృద్దుడు డేటింగ్ మోజులో పడి రూ. 46 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసి రిటైరైన ఓ 65 ఏళ్ళ వృద్ధుడు కాలక్షేపం కోసం ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యాడు. అనంతరం ఆ వైబ్‌సైట్ నుంచి మీరా అనే మహిళ అతనికి ఫోన్ చేసింది. డేటింగ్ సైట్‌లో కొనసాగాలంటే ప్రీమియం చెల్లించాలని అతన్ని ఆమె కోరారు. అతను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ముగ్గురు మహిళల ఫోటోలను పంపారు. వారిలో ఒక మహిళతో డేటింగ్‌కు అతను అంగీకరించాడు. అనంతరం మీరా ఆ వృద్దుడికి వీడియో కాల్ చేసి మీరు ఎంచుకున్న మహిళతో ఏడాది పాటు డేటింగ్ చేయాలంటే తనకు పదిలక్షలు చెల్లించాలని కోరింది. దీంతో అతను ఆ సదరు మహిళకు రూ 10 లక్షలు ముట్టచెప్పాడు. ఆ తర్వాత కూడా అతనికి తరుచూ ఫోన్ చేసి పోలీస్ వెరిఫికేషన్, బీమా చెల్లింపు అంటూ బాధితుడి నుంచి పలుమార్లు పెద్దమొత్తంలో వసూలు చేసింది.
ఈ క్రింది వీడియో చూడండి
మీరాకు మెుత్తంగా రూ 30 లక్షలు బాధితుడు ముట్టచెప్పాడు. చివరికి ఆయన ఎంపిక చేసుకున్న మహిళ ఫోన్ నెంబర్‌ను అందజేసింది. అనంతరం ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు ఆ వృద్ధుడు. ఆ కాల్ రీసివ్ చేసుకున్న యువతి తనను రోజీ అగర్వాల్‌గా బాధితుడికి పరిచయం చేసుకుంది. రోజీ కూడా ఆ వృద్ధుడు దగ్గర వివిధ కారణాలతో పెద్ద మెుత్తంలో డబ్బు వసూలు చేసింది. భారీగా నగదు చెల్లించినా డేటింగ్‌కు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది.తాను రిజిస్టర్ చేసుకున్న వెబ్‌సైట్‌ను పరిశీలించగా యూజర్ రివ్యూల్లో ఇది మోసపూరిత వెబ్‌సైట్ అనే కామెంట్స్ కనిపించాయి. అనంతరం తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే మీరాకు ఫోన్ చేసి తన సభ్యత్వాన్ని రద్దు చేసి తన డబ్బు తనకు చెల్లించాలని కోరాడు. తనదగ్గర నుంచి వసూలు చేసిన మెుత్తం రూ 46.25 లక్షలను ఈ ఏడాది జనవరి నాటికి చెల్లిస్తానని ఆమె హామీ ఇచ్చింది.

డబ్బు తిరిగి ఇస్తానని చెప్పిన తర్వాత ఆమె బాధితుడి కాల్స్‌ను రిసీవ్ చేసుకోలేదు. మరోవైపు తాను మోసపోయినట్టు వెల్లడైనా పరువు పోతుందనే భయంతో ఈ ఏడాది వరకూ ఆయన కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలపలేదు. రిటైర్‌మెంట్ తర్వాత వచ్చిన సొమ్ము మొత్తం డేటింగ్ వెబ్‌సైట్ మోసానికి ఆవిరి కావడంతో ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు చేప్పాడు. డేటింగ్ వెబ్‌సైట్‌పై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి ముసలాయన 65 సంవత్సరాలు వచ్చాక ఈ డేటింగ్ కోరిక ఏమిటి అని ఇప్పుడు పోలీసులు కూడా ఖంగుతిన్నారు.. అయితే ఇలా కేసు వదిలేస్తే, రేపు వీరు మరింత మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్తగా పోలీసులు కూడా ఈ కిలాడి గ్యాంగ్ ను పట్టుకోవాలి అని చూస్తున్నారు, అందుకే కొన్ని సైట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోకండి మీ సన్నిహితులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వారికి కూడా ఈ విషయం తెలియచేయండి.