పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం. సినిమాలలో చూస్తుంటాం. నిజానికి ఏడు పడగల పాము ఉందా అంటే లేదని కచ్చితంగా చెప్పలేము.. కానీ ఏడు తలల పాము విడిచిన కుబుసం ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ఉండేవారికి ఈ ఏడూ తలల పాము గురించి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఏడూ తలల పాము ఫోటో బాగా వైరల్ అయ్యింది. కానీ ఇది ఉందొ లేక కల్పితమో అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఉందనడానికి సాక్షం దొరికింది.

కర్ణాటకలోని రామనగర జిల్లా కనకపుర తాలూకా కొడిహళ్లి గ్రామంలో అలాటి ‘ఏడు తలల’ పాము ఒకటి తిరుగుతోందని చెబుతున్నారు. సాక్ష్యాంగా దాని ‘కుబుసాన్ని’ చూపుతున్నారు. ఆ నాగరాజు జాడ తెలియకపోయినా కేవలం ఆ కుబుసాన్ని చూసి అది ఉందని భావిస్తున్నారు. ఇక్కడి కుబుసం ఫొటోల్లో చూపినట్లు. శరీరం ఒకటే ఉందిగాని ‘తలలు ఏడు’ ఉన్నాయి. పైగా శరీరంతో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి. మెడ వద్ద నుంచి మొదలయ్యే తలలు కూడా పూర్తిగా విడిపడినట్లు ఉన్నాయి. శరీరం కొన్ని కొన్ని చోట్ల తెగిపోయింది. ఏడేసి తలలకు తగ్గట్టు శరీరం లేకపోవడం, తలలు చెదిరినట్లు ఉండడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాముల కుబుసాలను తీసుకొచ్చి అక్కడ ఉంచారని భావిస్తున్నాయి. అయితే అవన్నీ ఒకే పాము తలలని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. కుబుసం విడిచే సమయంలో తలలు చిరిగిపోయి ఉండొచ్చని, అది సప్తశిరో సర్పమేనంటూ పూజలు చేస్తున్నారు. దగ్గర్లో పాముల పుట్ట ఉండడం కూడా వారి విశ్వాసానికి బలం ఇస్తోంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తండోతండాలు వచ్చి పూజలు చేస్తున్నారు. ఇంత హడావుడికి మరో బలమైన కారణం కూడా ఉంది.
ఈ క్రింది వీడియో చూడండి
ఏడు తలల పాము వెళ్తుండగా తాను చూశానని ఆరు నెలల కిందట కోటెకొప్ప గ్రామానికి చెందిన దొడ్డ కెంపేగౌడ ఊరి వాళ్లతో చెప్పాడట. ఆ పామును తాను చూశానని, మీకూ చూపిస్తానని తీసుకెళ్లగా అక్కడ అది కనిపించలేదట. చెప్పేదేముంది, కాదని అంటున్నారు. కొన్ని కుబుసాలను తీసుకొచ్చి పెట్టారని, శరీరం, తలభాగాల్లో తేడాలే నిదర్శనమని అంటున్నారు. ఏడు తలలు ఉన్నాయని వాదనకు ఒప్పుకున్నా.. ఆహారం తీసుకోవడం, శ్వాస, నాడీకేంద్రాలు వంటి వాటిలో చాలా ఇబ్బందులు ఉంటాయని వివరిస్తున్నారు. ఒకవేళ జన్యులోపంతో పుట్టినా, అది అంత పెద్దయ్యేంత వరకు బతికి ఉండే చాన్సు లేదని చెబుతున్నారు. మరోపక్క.. దీని సంగతి తమకు తెలియదని జిల్లా అధికారులు చేతులెత్తేస్తున్నారు. కానీ అది నిజమైన ఏడు తలల పామేనని భావించే జనం కూడా తక్కువగా లేరు. కొడిహళ్లి గ్రామ పరిసరాల్లో అది ఎప్పుడోసారి కనిపించకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. చెప్పలేం మరి ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఏ పుట్టలో ఏ పామైనా ఉండొచ్చు. మరి ఈ ఏడూ తలల పాము గురించి మీరేమంటారు. ఆ పాము నిజంగానే ఉందా..లేదా కల్పితమా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.