ముకేష్ అంబానీ ఎటువంటి పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే తిరుగులేని వ్యాపార దిగ్గజాల్లో ఒకరు. ఇక భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా అంబానీలే నం.1 కుబేరులు. అంతేకాదు అంబానీ కుటుంబ సభ్యుల లైఫ్ స్టయిల్.. అంటే రోజువారీ జీవితంలో ఏ చిన్న అంశమైనా అమితాసక్తితో ఉంటుంది. ఎందుకంటే చెప్పులు పాలిష్ కి కూడా సగటు భారతీయుడి నెల జీతమంత ఖర్చు చేస్తారు మరి.. అందుకే కొద్ది కాలంగా ముఖేష్ అంబానీ కుటుంబాన్ని విపరీత జీవనశైలికి పర్యాయపదంగా మీడియా పేర్కొంటోంది. 10,000 కోట్ల ఆంటిలియా హౌస్ నుంచి 3 లక్షల టీ కప్పు వరకు, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమ వెనుకనున్న సంపద తాలూకు దర్పాన్ని ప్రదర్శించేందుకు వెనుకాడరు. ముంబైలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యం లాంటి ఇంటిలో 600 మంది కార్మికులు రోజూ పనిచేస్తారు.

రిలయన్స్ గ్రూప్ అధినేతగా ఉన్న అంబానీ సారథ్యంలో రిలయన్స్ పెట్రోలియం, గ్యాస్, చమురు శుద్ధి సంస్థ ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు నడుస్తున్నా ఇటీవల దేశం మొత్తం జియో సిమ్ లు ఫ్రీగా ఇచ్చి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చారు. వారు నివశించే 27 అంతస్తుల భవనం మొదటి నాలుగు ఫ్లోర్లు కేవలం కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు వారి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో. ప్రపంచంలో విలాసవంతమైన ప్రతి కారు ఆయన కాంపౌండ్ లో ఉంటుంది. ఒక్కో ఫ్లోర్ లో 160 కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం ఉంది. ఇక అధునాతన హోమ్ థియేటర్స్, అద్బుతమైన స్విమ్మింగ్ పూల్స్ ఈ ఆంటెల్లా లో ఉన్నాయి. ఇక ఇంటిపైన అధునాతనమైన హెలిప్యాడ్ ఉందట. మూడు హెలికాఫ్టర్లు ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చు.
ఈ క్రింది వీడియో చూడండి
ఈ ఇంటికోసం ఏకంగా ఒక ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ నిర్మించారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఎంత విద్యుత్ ను వినియోగిస్తారో. మరి ఇంతటి విలాసవంతమైన ఈ ఇంట్లో పనిచేసేవాళ్లకు జీతాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదట. ముఖేష్ అంబాని పర్సనల్ కార్ డ్రైవర్ కు ఏకంగా నెలకు రెండు లక్షల రూపాయల జీతం ఇస్తారట. వీటితో పాటు ఇతర అలవెన్సులు అదనం. అంటే కార్పోరేట్ కంపెనీ జనరల్ మేనేజర్ కు ఇచ్చే జీతంతో సమానమైన జీతం అన్నమాట.అంతేకాదు,ఈ ఇంట్లో ఆరు వందల నుంచి వెయ్యి వరకు పనివాళ్ళు ఉంటారట. కుకింగ్ డిపార్ట్మెంట్ లో చేసే హెడ్ కుక్ ల జీతం 2 నుంచి 3 లక్షల వరకు వరకు ఉంటుందట. కుకింగ్ డిపార్ట్ మెంట్ లోని ప్రధానమైన వాళ్లు, సూపర్ వైజర్లు, ఇతర టెక్నికల్ స్టాఫ్, బ్యూటీషియన్లు, పర్సనల్ అసిస్టెంట్లు.. వీరిలో ప్రతినెలా లక్షల్లో జీతం తీసుకునే వారు కనీసం వంద మందయినా ఉంటారట. ఇంత జీతాలు ఇంత భారీగా ఉన్న ఈ ఇంట్లో ఎంత మంది ఉంటారని ఆశ్చర్యపోతున్నారా? ఆంటెల్లాలో కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారు. ఈ ఐదుగురు నివసించే ఈ ఇంటికి నెలకు పది కోట్ల మేర ఖర్చు వస్తుందట.