Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

నెమలి పించం ఇంటిలో ఉండవచ్చా మంచిదా చెడా ఈ వీడియో త‌ప్ప‌క చూడండి

$
0
0

నెమలి పించం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో కదూ.. ! రంగు రంగుల కంటి ఆహారం, దాని చుట్టూ మెరిసే రెప్పలు ఉన్నట్టు. చూడగానే.. ఎవరినైనా ఎట్రాక్ట్ చేస్తుంది. మీకు గుర్తుందా.. చిన్నప్పుడు నెమలిపించం కనిపిస్తే.. బుక్స్ పెట్టుకునేవాళ్లం. అయితే.. అప్పుడు సరదాగా పెట్టుకున్నప్పటికీ.. ఈ నెమలిపించం అనేక దోషాలను తొలగిస్తుందని తెలుసా ?నిజమే.. నెమలి పించం డెకరేషన్ గానే కాదు.. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఈ నెమలిపించం అన్ని రకాల దోషాలను నివారించి.. ఇంట్లో వాస్తు సమస్యలకు దూరంగా ఉంచుతుంది. మరి దోషాలు నివారించడానికి నెమలిపించం ఎలా ఉపయోగించాలి ? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోవాలనుందా ? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for నెమలి పించం

మూడు నెమలి పించములు తీసుకుని నలుపు దారంతో కట్టాలి. తర్వాత కొంచెం వక్కపొడి చల్లి.. కొంచెం నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు ఓం శనేశ్వరాయ నమ: అని.. 21 సార్లు జపించాలి. అలాగే వాస్తు దోషాలు తొలగించుకోవడానికి 8 నెమలి పించంలను తీసుకుని.. అన్నింటినీ కలిపి.. తెలుపు రంగు దారంతో కట్టాలి. అలా కట్టిన తర్వాత.. ఓం సోమాయ నమ: అని జపించాలి. ఇక లాకర్ దగ్గర నెమలి పించం పెడితే.. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే.. డబ్బుని ఎట్రాక్ట్ చేస్తుంది.నెమలిపించం నెగటివ్ ఎనర్జీస్ ను, వాస్తు దోషాలను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇంటి ద్వారానికి కొన్ని నెమలి పించాలు పెట్టడం మంచిది. అలాగే ఆఫీస్ లో నెమలి పించం గానీ, నెమలి పించం పెయింటింగ్ గానీ పెట్టుకోవడం వల్ల.. మీ పనితీరు మెరుగవుతుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక పురాతన కాలంలో నెమలిపించంను మెడిసిన్ గా ఉపయోగించేవాళ్లు. అలాగే విసనకర్రల రూపంలో వాడేవాళ్లు. అంటే.. నెమలిపించానికి, ఆరోగ్యానికి సంబంధం ఉన్నట్టే కదా.. అలాగే నెమలిపించంను ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల.. చెడుని, నెగటివ్ ఎనర్జీస్ ని మీ ఇంటి నుంచి తీసుకెళ్లిపోతుంది.

Related image

బెడ్ రూంలో నెమలి పించం పెట్టుకోవడం వల్ల.. భార్యాభర్తల మధ్య అండర్ స్టాండింగ్ తోపాటు, సంబంధం మెరుగ్గా ఉంటుంది.మన వేదాల్లో.. నెమలిపించంకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీకృష్ణుడి రూపం నెమలి పించం లేకుండా.. పూర్తి అవదంటే అతిశయోక్తిలేదు.పురాతన గ్రంధాల ప్రకారం నెమలిపించానికి ఆధ్మాత్మిక శక్తి ఉందని, అందుకే ఆధ్మాత్మికంగా నెమలిపించముకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తుంది.పిల్లల ఏకాగ్రత పెంచడం కోసం మరియు వారిని అహ్లాద పర్చడం కోసం కూడా వారి రూపంలో లేదా ఇంట్లో నెమలి పించం ఉంచడం మంచిది.
నెమలి పించంను తదేకంగా చూడటం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది. అందుకే పిల్లలకు అది ఏకాగ్రత పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేల చేస్తుంది.రాహు కేతు పూజలు చేయించుకునే వారు, ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలు పడుతున్న వారు పడుకున్న సమయంలో తలగడ కింద నెమలి పించం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇంట్లో బెడ్‌ రూంలో తూర్పు వైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి పించం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.అంతేకాదు పంచంలో సంభోగం చెయ్యని జీవి నెమలి . అత్యంత పవిత్రమైన జీవిగా నెమ‌లిని చెబుతారు.పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి.నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల పై నెమలీక ధరిస్తాడు.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles