ప్రపంచకప్ తర్వాత రిటైరవుతాడనే ఊహాగానాలకు కాస్త బ్రేక్ ఇస్తూ మహేంద్రసింగ్ ధోని.. కొన్ని రోజుల పాటు సైన్యంలో సేవలందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆర్మీ బెటాలియన్‌లో సేవలు అందించేందుకు మిస్టర్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోని చేసుకున్న దరఖాస్తునకు భారత ఆర్మీ నుంచి అంగీకారం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోద ముద్ర వేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని ధోనీ స్వయంగా పేర్కొన్న నేపథ్యంలో తుది జట్టులో ఆయన స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు నెలల పాటు పారాచూట్ ఆర్మీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ధోనీ భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోగా దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అంగీకారం తెలిపడంతో ధోనీ సైన్యంలో సేవలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఇదిలా ఉంటే ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్‌లో రెండు నెలల పాటు సాధారణ సైనిక శిక్షణ తీసుకోనున్నారు. ధోనీ గౌరవ్ లెఫ్టినెంట్ కల్నల్ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను ఎలాంటి ప్రత్యక్ష సైనిక విధుల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదని, అలాగే కల్నల్ హోదాలో ఆయన సైనిక కార్యకలాపాల్లో ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సన్నిహిత వర్గాలు తేల్చుతున్నారు. కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే అనుమతిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ధోనీ ఎక్కడ పని చేయబోతున్నాడు.. ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో సైన్యం నుంచే సమాచారం బయటికి వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు కశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్ – గార్డ్ – పోస్ట్ గార్డ్ డ్యూటీల్లో ధోని పాల్గొనబోతున్నాడని వెల్లడైంది.
ఈ క్రింద వీడియోని చూడండి
కశ్మీర్ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోనీ విధులు నిర్వహించనున్నాడు. 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన ధోని.. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పని చేస్తుంది. 2015లో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. అప్పుడతను పెద్ద సాహసమే చేశాడు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోని.. ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకి.. నేల మీద సురక్షితంగా ల్యాండయ్యాడు. దీంతో అతడికి ప్యారాట్రూపర్ గా అర్హత వచ్చింది.

అయితే ఆగ్రాలో ధోనీ శిక్షణ పొందిన నెలరోజుల పాటు సాధారణ సైనికుడిగానే ఉన్నాడని, తోటి సైనికులతోనే గది, భోజనం పంచుకున్నాడని సైనిక వర్గాలు తెలిపాయి. సైనిక పారాట్రూపర్ తరహాలో క్రమశిక్షణ తప్పకుండా తనకు కేటాయించిన పారచూట్ ను మడతపెట్టుకొని భద్రంగా చూసుకునే వారని, సాధారణ సైనికుల తరహాలోనే అన్ని రకాల సైనిక డ్రిల్స్ లో పాల్గొన్నారని తెలిపారు. ధోనీ వద్ద ఆడీ కార్ ఉన్నప్పటికీ ఆ నెల రోజులు మాత్రం ఆర్మీ కేటాయించిన జిప్సీ వాహనంలోనే తిరిగారని గుర్తుచేసుకున్నారు. అంతే కాదు ధోనీ సైనిక శిక్షణలో భాగంగా గన్ ఫైరింగ్, ఆయుధాల నిర్వహణ వంటివి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక ధోనికి ఆర్మీ నుంచి ఇప్పుడు జీతం కూడా వస్తుందని తెలుస్తోంది, ఆయనకు నెలకు సుమారు 70 వేల రూపాయల జీతం చెల్లించనున్నారట. ఇదండి కూల్ కెప్టెన్ వర్క్, మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.
The post ఆర్మీలో ధోనికి కఠినమైన శిక్షణ ఇంతకీ ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసా అతనికి జీతం ఎంతో తెలిస్తే షాక్ appeared first on Telugu Messenger.