ఇటీవల విమాన ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.. ప్రయాణం చేసిన సమయంలో బాగానే ఉన్నా అసలు క్షేమంగా గమ్యానికి చేరుకుంటామా అనే భయం వారిని కలవరపెడుతోంది. ఇండోనేషియా దేశానికి ఏదో శాపం తగిలినట్టుంది. ఇదివరకే వారి విమానమొకటి గల్లంతై ఆచూకీ కూడా కనిపించలేదు. అప్పట్లో ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ లెన్స్ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకర్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమాన ప్రమాదం చోటుచేసువడం విషాదం నింపింది.

సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోయింది. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్ ఎయిర్ విమానం సుమిత్ర దీవుల్లోని పంగ్కల్ షినాంగ్ నుంచి టేకాఫ్ అయ్యింది. అయిన 13 నిమిషాలకే ఇంజన్ లో లోపం తలెత్తి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో విమానం కోసం గాలించిన అధికారులు అది జువా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు నిర్ధారించారు.

ఇండోనేషియాలో కూలిపోయిన ఈ విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి పైలెట్ ఉన్నట్లు లయన్ ఎయిర్‌వేస్ అధికారులు తెలిపారు. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ వేస్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఢిల్లీకి చెందిన భవ్యే సునేజా వయసు 31 సంవత్సరాలు..ఈ విమానానికి పైలట్‌గా వ్యవహరిస్తున్నారని, అతను చాలా అనుభవమున్న పైలట్ అని అతని సన్నిహితులు, లయన్ ఎయిర్ వెల్లడించారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలట్‌గా చేరారని, ఆయన ఎక్కువగా బోయింగ్ 737 విమానాన్నే నడిపేవారని అధికారులు తెలిపారు.అతను చాలా అనుభవమున్న పైలట్ అని, ఇప్పటివరకు పైలట్‌గా అతని రికార్డులో ఎలాంటి లోపాలు లేవని, అందుకే అతనిని ఇండోనేసియాకు చెందిన లయర్ ఎయిర్ సంస్థలోనే ఉంచాలనుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే సునేజాతో తన స్వస్థలంలో పోస్టింగ్ ఇప్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏడాది అనంతరం ఢిల్లీలో పోస్టింగ్ ఇస్తామని చెప్పామని అధికారులు తెలిపారు.

మా సంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే అని లయన్ ఎయిర్ వెల్లడించారు. వారు కూడా ఢిల్లీ పోస్టింగే కావాలని అడిగేవారు. దాంతో సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయాం. ఏడాది తర్వాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని చెప్పాం.కాని వారందరూ జలసమాధి అయ్యారు.
ఈ క్రింద వీడియోని చూడండి
ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన సునేజా.. మయూర్ విహార్ ఫేజ్1లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. అతడు బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి 2009లో పైలట్ లైసెన్స్ పొందాడు. మార్చి 2011లో లయన్ ఎయిర్‌లో చేరక ముందు ఎమిరేట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ బోయింగ్ 737 నడిపిన అనుభవం కూడా సునేజాకు ఉంది. కాగా సునేజా మృదుస్వభావి అని, చాలా తక్కువ మాట్లాడతాడని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక కొద్ది నిమిషాల ముందే విమానంలో ప్రమాదం ఉందని గుర్తించిన పైలెట్ వెనక్కి వస్తాను అని చెప్పాడు. కాని కొద్ది సేపటిలోపే విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటన నిజంగా భారతీయులు అందరిని కలిచివేసింది.
The post కుప్పకూలిన విమానం కొద్ది నిమిషాల ముందు రికార్డ్ అయిన ఇండియన్ పైలెట్ మాటలు వింటే కన్నీళ్లే appeared first on Telugu Messenger.