పశ్చిమ బంగాల్‌కు ఆనుకుని ఉన్న బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో 76 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తం ఉంది. నైరుతు రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి..మరో మూడ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలోని మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి అటు తీరం వెంబరడి గంటకు 45-50 కి.మీ వేగంతో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏటూరునాగారం మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రామన్నగూడెం, రాంనగర్ వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు వరద కారణంగా నిలిచిపోయాయి. ఇక తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల్లో రాజమండ్రి కాకినాడ భీమవరం పాలకొల్లు నరసాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు ఎగువన కురుస్తున్నవర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 14వేల 683 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో 17వందల 99 క్యూసెక్కులు. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 16వందల 33 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 16వందల 03.57 అడుగులు. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం వంద టీఎంసీలు కాగా… ప్రస్తుతం 24.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది..ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఈ క్రింద వీడియోని చూడండి
విశాఖ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి..రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని నీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 13 గేట్లను ఎత్తి..దిగువకు 17300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వరద తాకిడి ఎక్కువైంది.

మరోవైపు జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు జోరందుకున్నాయి. రాగల 72 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని , మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక తూర్పుగోదావరి, ప్రకాశం, పశ్చిమగోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రా జిల్లాలకు భారీ వర్షసూచన చెప్పడంతో వరద పోటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వేటకు వెళ్లవద్దని సముద్రం దగ్గరకు పర్యాటకులు వెళ్లకూడదు అని తెలియచేస్తున్నారు.
The post బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారీ ముప్పు తప్పదు appeared first on Telugu Messenger.