నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రణయ్ హత్య కుల అహంకారంతో జరిగింది అనేది తెలిసిందే, ఈకేసుకు సంబంధించి ఏడుగురు నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకేసు తర్వాత ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ హత్యకు స్కెచ్ వేసిన గ్యాంగ్ మొత్తం పోలీసుల అదుపులో ఉన్నారు, వారిని వదలకూడదు అని సమాజం మొత్తం కోరుకుంటోంది.. ఇటు ప్రణయ్ కుటుంబం కూడా జిల్లా ఎస్పీ కలెక్టర్ తో మాట్లాడి వారికి బెయిల్ రాకుండా చూడాలి అని కోరుతున్నారు
ఈ సమయంలో మారుతిరావు మిర్యాలగూడలో చేసిన అన్యాయలు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 1983 లో కిరోసిన్ వ్యాపారంతో ప్రారంభం అయిన మారుతిరావు ప్రస్ధానం, నేడు 100 కోట్ల రూపాయలు సంపాదించే స్దితికి వెళ్లింది.. దీని వెనుక మారుతి రావు అనేక మోసాలు చేసి పైకి వచ్చాడు అని అంటున్నారు, ఈ సమయంలో మారుతిరావు గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు ప్రణయ్ పెదనాన్న. అలాగే ఏ డబ్బు అయితే ప్రణయ్ కు లేదు అని అంటున్నాడో దాని గురించి కూడా ఆయన పెదనాన మాట్లాడారు, మారుతిరావు ఇంకా కిరోసిన్ వ్యాపారంతో తన జీవితం మొదలుపెట్టాడు, తాము పుట్టుకతోనే భూ స్వామి కుటుంబం, రైతు కుటుంబం ,మాకు కొంత భూమి ఉంది అలాగే పైకి పెరిగి వచ్చాం నా ఐదుగురు అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈ మిర్యాలగూడలో అందరికి మా ఫ్యామిలీ గురించి తెలుసు, ఇలాంటి వాడికి మా అబ్బాయి అల్లుడిగా వెళ్లడం అంటే మారుతిరావు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, కాని మా అబ్బాయిని చంపించాడు. వారు చదువుకునే సమయంలోనే మారుతిరావు నన్ను పిలిచి మీ తమ్ముడు కుమారుడు ఇలాంటి పనిచేస్తున్నాడు, తనని అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు.. నేను ప్రణయ్ ని హెచ్చరించాను, వాళ్ల అమ్మాయి జోలికి వెళ్లద్దు అని చెప్పాను, ఆ సమయంలో నేను మారుతిరావుకి సపోర్ట్ చేశాను కాని ఇంత కిరాతకంగా చంపేశాడు.మాకు మారుతిరావులా 100 కోట్ల ఆస్తిలేకపోయినా, మాకు 20 కోట్ల ఆస్తి ఉంది. పొలాలు తోటలు సొంత ఇళ్లులు స్దలాలు ఉన్నాయి. రాజకీయంగా పలుకుబడి ఉంది. అయినా మా కుమారుడ్ని కులంలో తక్కువ అని చంపాడు అని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు..మేము పుట్టుకతో బీదవాళ్లం కాదు, మేము రైతు కుటుంబం, మా తమ్ముళ్లు అందరిని చదివించి పెద్ద వారిని చేయించాను, ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. నా సోదరులు అందరిని ప్రణయ్ హత్య కలిచి వేసింది, ఇలాంటి వారిని ప్రభుత్వం క్షమించి వదిలితే, ప్రజలే వీరికి తగిన గుణపాఠం చెబుతారని కన్నీరు మున్నీరు అయ్యారు.