జీనియస్ అనే పేరు వినగానే మనకు ఒక ఐన్ స్టీన్, ఒక శ్రీనివాస రామానుజన్, ఒక నికోలస్.. ఇలా చాలా మందే గుర్తుకు వస్తారు. కానీ ఆ లిస్ట్ లో ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు మాత్రం ఉండదు. మనలో చాలా మందికి ఈయన గురించి తెలీదు. 19 ఏళ్లకే పిహెచ్ డి కంప్లీట్ చేసి ఐన్ స్టీన్ రూపొందించిన థియరీ అఫ్ రిలేటివిటీకి సవాలు విసిరినా మేధావి ఈయన. నాసా అపోలో మిషన్ లాంచింగ్ సమయంలో కొన్ని సెకండ్స్ వరకు 21 కంప్యూటర్స్ పనిచెయ్యడం ఆగిపోతే తన టాలెంట్ తో ఆ మిషన్ కు సక్సెస్ చేసిన జీనియస్ ఈయన. ఆయనే బీహార్ కు చెందిన డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన నాసాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎలా ఎదిగాడు. ప్రపంచ మేధావుల పక్కన కూర్చోవాల్సిన ఈయన ఇలా పిచ్చివాడిలా ఎందుకు మారాడు. ఇలా ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ లో లాల్ బహదూర్ సింగ్ మరియు లహోసా దేవిలకు ఏప్రిల్ 2 1942 న జన్మించాడు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు. బాల్యంలో వసిష్ఠ నారాయణ సింగ్ ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేశారు. 1962 లో మెట్రిక్యులేషన్ పరీక్షను పాసై బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రజ్ఞావంతుడు ఈయన. పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్ఠాత్మక పాట్నా సైన్సు కళాశాలలో చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డా. పి. నాగేంద్ర ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఆయన వశిష్ఠ నారాయణ లోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా – బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ జాన్ ఎల్. కెల్లీ అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోని ” జనరల్ టోపోలజీ ” అనే పుస్తకం రాసి ఫెమస్ అయ్యారు..

ప్రొఫెసర్ కెల్లీ ఆయనను ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని చెప్పాడు. అయితే తనతో అంత డబ్బు లేదని, యు.ఎస్.ఎ రావడం కష్టమని తెలిపాడు. దానికి ప్రొఫెసర్ కెల్లీ ఆర్థిక సహాయం చేస్తానని ప్రామిస్ చేశాడు. అలా “యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా – బెర్కిలీ” (UCB) లో చేరాడు.. ఆ విధంగా 1969 లో ఆయన కాలిఫోర్నియా, యు.ఎస్.ఎలో పరిశోధనా స్కాలర్ గా నిలిచాడు. ఆయన ఏ హెచ్.ఒ.డి కింద పనిచేయకుండా పి.హె.డి పూర్తి చేసి నాసాలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అక్కడ ఆయన ” సైక్లిక్ వెక్టర్స్ స్పేస్ థియరీ / రీ ప్రొడ్యూసింగ్ కెర్నల్స్ అండ్ ఆపరేటర్స్ విత్ ఎ సైక్లిక్ వెక్టార్” అనే అంశం పై పరిశోధనలు చేశారు. ఆయన చేసిన పరిశోధన ఆయనను ప్రపంచంలో విజ్ఞానశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిపాయి. ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ఫెమస్ సైంటిస్టులు రచనలను కూడా సవాలూ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.

తర్వాత అయన వాషింగ్టన్ లో గణిత శాస్త్రలో అసోసియేట్ ప్రొఫెసర్ గా అపాయింట్ అయ్యారు.. అక్కడ కొన్ని రోజులు పనిచేసి 1971 లో భారతదేశానికి వచ్చాడు. అప్పుడు ఐ.ఐ.టి, కాన్పూర్ లో ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఎనిమిది నెలలు అక్కడ పనిచేశాడు. ఆ తరువాత ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా చేరాడు. తరువాత 1973 లో కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1973 లో ఆయనకు సైనిక అధికరి అయిన డా.దీప్ నారాయణ సింగ్ కుమార్తె అయిన వందనా రాణితో పెళ్లయింది.. తర్వాత ఆయన కలకత్తాకు తిరిగి వెళ్లారు. అప్పుడే ఆయనకు మొట్టమొదటిసారి మతిస్థిమితం లేకుండా అయ్యింది.. ఆయన కుటుంబం ఆయనను డాక్టర్ కు చూపించారు. ఆయనను 1976 లో రాంచీ లోని మెంటల్ హాస్పటల్ లో జాయిన్ చేశారు.. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కానీ తర్వాతి కాలంలో బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పై ఖర్చుచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన 1976 నుండి షిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధ పడ్డాడు.. అదే కాలంలో వశిష్ఠ భార్య విడాకులు తీసుకున్నందుకు మసస్తాపానికి గురయ్యారు. తర్వాత ఆయన సన్యాసి అయినా అరుంధతి అనే మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.
ఈ క్రింద వీడియో చూడండి
1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు సొంత ఊరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అక్కడ ఆయన తమ్ముడు అయోధ్య ప్రసాద్ తో కలిసి డాక్టర్స్ ను కలిసి తర్వాత జనతా ఎక్స్‌ప్రెస్ లో ఇంటికి బయలుదేరాడు. అయితే దారి మధ్యలోనే ఆయన రైలు దిగి ఎవరికీ చెప్పకుండా ఏటో వెళ్ళిపోయాడు.. అతని సోదరుడు అతన్ని చాలా వెతికాడు కానీ కనపడలేదు. చివరికి అందరు అతను చనిపోయాడని అనుకున్నారు. కానీ 1993 లో శరణ్ జిల్లా, డోరిగంజ్ లో ఆయన హఠాత్తుగా కనిపించారు. తర్వాత వశిష్టబాబు ” నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ” చికిత్స కోసం చేరాడు. ఆయన ఫిబ్రవరి 1993 నుండి జూన్ 1994 వరకు ఆ హాస్పటల్ లోనే ఉన్నారు. కానీ కోలుకోలేదు. అక్కడి వైద్యులు ఆయనను యు.ఎస్. లో చికిత్స కోసం పంపించాలని కోరారు. కానీ ఆయన వెళ్ళను అని చెప్పాడు. తన సొంత ఊరికి వెళ్లి అక్కడే ఉండిపోవాలని డిసైడ్ చేసుకున్నాడు.. అప్పటి నుండి ఆయన తన సొంత ఊరిలో ఒక సామాన్యుడిలా జీవితాన్ని గడుపుతున్నాడు.
The post ఒకప్పుడు నాసాలో సైంటిస్టు.. ఇప్పుడు ఇలా… వశిష్ఠ నారాయణ్ సింగ్ రియల్ స్టోరీ.. appeared first on Telugu Messenger.