సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు ఏం తింటున్నారు అనేది చాలా మంది చూడరు.. ముఖ్యంగా వారికి ఏది కనిపిస్తే అది నోటిలో పెట్టుకుంటారు.. దీని వల్ల కొన్నిసార్లు తినకూడని ఆహార పదార్ధాలు కూడా వారి పిల్లలు తినడం జరుగుతుంది.. చాలా మంది వారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది.. అందుకే చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ముఖ్యంగా చిన్న తనంలో వారిని దేవుడితో సమానంగా చూస్తారు. తెలిసి తెలియక చేసే పనులుగా వారు భావిస్తారు. ఇక కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి .ముఖ్యంగా ఏది పడితే అది ఆహారంగా పెట్టకూడదు. పైగా వారిపై ఎంతో కేర్ తీసుకోవాలి. తాజాగా ఓ కుటుంబానికి ఎవరికి రాని ప్రాబ్లం వచ్చింది.. అసలు ఇలాంటి ఘటన జరుగుతుంది అని ఆ కుటుంబం కూడా ఎఫ్పుడూ ఊహించి ఉండదు..క్షణాల సమయంలో ఆమె కుమార్తె చేసిన పనికి తల్లి మనసు తల్లడిల్లిపోయింది.. తన కూతురికి ఇలాంటి కష్టం రావడంతో ఆమె కన్నీరుమున్నీరు అవుతోంది. మరి ఆ కుటుంబానికి వచ్చిన సమస్య ఏమిటి అనేది చూద్దాం.

రష్యాకు చెందిన ఓ కుటుంబం హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి స్పెయిన్ వచ్చింది.. ఇక్కడి నుంచి ఇబిజా దీవికి వెళ్లిన వారు ఓ అమ్యూజ్‌మెంట్ పార్కుకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారిలో మూడేళ్ల ఓ చిన్నారికి ఓ వస్తువు దొరికింది. అది చాక్లెట్ అనుకున్న ఆ పాప దాన్ని తినేసింది. కాసేపటికే స్పృహతప్పి పడిపోయింది. దాంతో కంగారుపడ్డ ఆమె తల్లి వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లింది. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ పాప శరీరంలో ఉత్తేజాన్ని పెంచే వయాగ్రా వంటి మందు ఉందని తేల్చారు. చిన్న పిల్లల శరీరాలు అటువంటి మందుల శక్తిని తట్టుకోలేవని, దాంతో ఆ పాప విషమ పరిస్థితిలో ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. పాపకు అమ్యూజ్‌మెంటు పార్కులోనే ఆ మందు దొరికినట్లు తెలిసింది.
ఈ క్రింద వీడియో చూడండి
అయితే ఈ విషయం తెలియడంతో ఆ పార్క్ వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు, ముఖ్యంగా చెకింగ్ చేసిన తర్వాత కూడా ఇలా ఎందుకు డ్రగ్ వచ్చింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు.. అంతే కాదు అక్కడ స్టాఫ్ అలాగే వచ్చిన పర్యాటకుల గురించి వివరాలు తీసుకున్నారు పోలీసులు.. సీసీ కెమెరాలు కూడా చూస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఇలాంటి మెడిసన్ చాలా వరకూ అమ్మకుండా చర్యలు తీసుకున్నారు. మరి ఈ సమయంలో ఇది ఎవరు తీసుకుచ్చారు అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.. అయితే ఆ చిన్నారికి ఈ మెడిసన్ శరీరంలోకి వెళ్లడంతో తట్టుకోలేకపోయింది. చిన్న పిల్లలు పైగా ఇలాంటి డ్రగ్ వారికి శరీర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తాయి అయితే ఆ అమ్మాయికి ప్రస్తుతం సిరియస్ గా ఉండటంతో డ్రగ్ కంట్రోల్ అధారిటీ కూడా సీరియస్ అయింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి ఇప్పుడు ఇలా వయాగ్రా తీసుకోవడంతో చావు బతుకుల మీద ఉంది. చూశారుగా చిన్న పిల్లల విషయంలో ముఖ్యంగా వారు తీసుకునే ఫుడ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.
The post మూడేళ్ళ పాప వయాగ్రా తినేసింది. తరువాత ఏం జరిగిందో తెలిస్తే కన్నీరే appeared first on Telugu Messenger.