కశ్మీర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసే కామెంట్లు భారత్ ని మరింత రెచ్చగొడుతున్నాయి.. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. తమకు భారత్ తో సయోధ్య లేదు అని చెబుతోంది. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ మధ్యవర్తిత్వం కూడా ఇప్పుడు పాక్ వద్దు అంటోంది. రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలని మిగిలిన దేశాలు సలహా ఇస్తున్నాయి. కాని దానికి కూడా పాక్ ఒప్పుకోవడం లేదు. భారత్ కు మరో ఛాన్స్ ఇవ్వకూడదు అని భావిస్తోంది.

గతంలోనే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఆఖరి అస్త్రం ప్రయోగించారని విమర్శలు చేశారు ఇమ్రాన్ ఖాన్ తదుపరి ఆయన చూపు కశ్మీర్ స్వాతంత్ర్యంపైనేనని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌పై చర్యలు తీసుకునేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు ఆయన.ఆర్టికల్ 370 సవరణ నేపథ్యంలో ఈసారి తమ స్వాతంత్ర్య దినాన్ని (ఆగస్టు 14) పాక్ ‘కశ్మీర్ ఐక్యత దినం’గా జరుపుకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను జర్మన్ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీతో ఇమ్రాన్ పోల్చారు. ఆర్‌ఎస్ఎస్ భావజాలం ప్రకారమే భారత్‌లో అంతా జరుగుతోందని అన్నారు.

ఇక అన్నీ దేశాలు భారత్ కు సపోర్ట్ చేయడంతో భారత్‌తో చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. విదేశీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని మోదీ చర్చలకు ఆహ్వానించిన ప్రతీ సందర్భంలో తమ సైన్యాన్ని దెబ్బ తీస్తున్నారని ట్రంప్‌తో ఇమ్రాన్ చెప్పినట్లు తెలిసింది.
ఈ క్రింద వీడియో చూడండి
న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. తాను శాంతి గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారి.. భారత్ కేవలం బుజ్జగింపులాగానే భావిస్తోందని.. ఇంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పారు. అణ్వాస్త్ర బలం ఉన్న తమ ఇరు దేశాల మధ్యా రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వాతావరణంపై ఆందోళన చెందుతున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ.. ఈ విషయంలో ఇండియాతో తాడోపేడో తేల్చుకుంటామని.. అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి మరింత బలంగా తమ వాదన వినిపిస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాకిస్దాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడే కామెంట్లు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు.గతంలోనే ఆయన అన్నారు మా వద్ద ఉన్న న్యూక్లియర్ బటన్‌ను దీపావళి కోసం దాచిపెట్టలేదు అంటూ సో పాకిస్దాన్ కూడా ఆచితూచి మాట్లాడితే బెటర్ అనేది రక్షణ శాఖ అధికారులు చెబుతున్న మాట.
The post భారత్‌తో ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవటాలు పాక్ appeared first on Telugu Messenger.