2019 పిబ్రవరి 26 న జరిగిన సిట్చూవేషన్ ఎవరూ మర్చిపోలేనిది… రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ద వాతావరణం కలిగించిన సంఘటన..పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగం లోకి చొచ్చుకు వచ్చింది. నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ సందర్భంగా అభినందన్.. తన దళ నాయకుడికి ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా.. అని మిగ్ 21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు.

ఎఫ్-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్ లో రికార్డయ్యింది. నాలుగు సెకెన్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. అంటే గంటకు 900 కిలోమీటర్ల వేగంతో మిగ్-21 ప్రయాణించింది. ఆ వేగంతో 86 సెకెన్ల పాటు మిగ్ ప్రయాణించింది. ఈ వైమానిక పోరాటంలో అభినందన్ విమానం పాకిస్తానీ భూభాగంలోకి వెళ్ళగా, పాకిస్తానీ వైమానిక దళం వారు దీన్ని కూల్చివేశారు. దీనితో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన్ దిగినట్లు వెల్లడైంది. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ 21 ద్వారా ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. అది నేరుగా ఎఫ్ 16ను ఛేదించింది.తర్వాత పాకిస్దాన్ లో అభినందన్ ని పాక్ ఆర్మీ బంధించింది, పాక్ భారత్ చర్చల తర్వాత అభినందన్ ను విడిచిపెట్టారు పాక్ ఆర్మీ అధికారులు.
ఈ క్రింద వీడియో చూడండి
వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు కేంద్రం ఇటీవల ఆయనకు వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. సరిహద్దులకు అవతల పాకిస్తాన్ కు పట్టుబడి, ఆపై అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగా తిరిగి వచ్చిన అభినందన్ మళ్లీ యుద్ధ విమానాన్ని ఎక్కాడు. పాక్ నుంచి వచ్చాక భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్న అభినందన్ కు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి.. తిరిగి విమానం నడిపేందుకు అభినందన్ ఫిట్ గా ఉన్నాడని డాక్టర్లు స్పష్టం చేయడంతో, రాజస్థాన్ లోని వైమానిక స్థావరంలో అభినందన్ యుద్ధ విమానం ఎక్కారు. ఆరునెలల విరామం తర్వాత ఫైటర్ విమానం కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు.. దీంతో అతని స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా ఆనందంలో ఉన్నారు, తోటి వాయుసేన ఉద్యోగులు కూడా అతనికి వెల్ కం పలికారు. వైమానికదళ అధికారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక పాక్ పై యుద్దం జరిగితే కచ్చితంగా అభినందన్ ముందు ఉండి పోరాటం చేస్తాను అని చెబుతున్నాడు. అభినందన్ కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.
The post తిరిగి జాబ్ లో చేరిన అభినందన్ ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడో తెలిసి వణికిపోతున్న పాకిస్థాన్ appeared first on Telugu Messenger.