సముద్రంలో స్నానం చేస్తే సరదాగా ఉంటుంది కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం షార్క్ల్ లు పట్టుకుంటే వదలవు…ప్రపంచవ్యాప్తంగా మనుషులపై షార్క్‌ల దాడుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో జరిగిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం తెలిసింది.తూర్పు అమెరికా, దక్షిణ ఆస్ట్రేలియాలో షార్క్ దాడుల సంఖ్య 20 ఏళ్ల క్రితం నాటితో పోల్చితే దాదాపు రెండింతలైంది. దాడులు పెరగడం వెనుకున్న కారణాల గురించి చాలా అధ్యయనాలే జరుగుతున్నాయి. ఈ అంశం గురించి షార్క్ రీసెర్చ్ డైరెక్టర్ గెవిన్ నేలర్ కొన్ని విషయాలు చెప్పారు. సముద్రంలోకి వచ్చే జనాల సంఖ్యకు, షార్క్ దాడులకు చాలా దగ్గర సంబంధం ఉందని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియా దక్షిణ తీరం, అమెరికా తూర్పు తీరంలో జనాలు ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో సహజంగానే బీచ్‌లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ఆస్ట్రేలియా తీరంలో ఫర్ సీల్స్ సంఖ్య బాగా పెరుగుతోంది. గ్రేట్ వైట్ షార్క్స్‌కు ఈ జీవి ఇష్టమైన ఆహారం అని చెబుతున్నారు. అమెరికాలో మెరైన్ మామల్ యాక్ట్ తీసుకురావడంతో సీల్స్ సంఖ్య పెరుగుతోందని, ఫలితంగా వేసవి సమయంలో వీటిని తినేందుకు షార్క్‌లు తీర ప్రాంతానికి రావడం కూడా ఎక్కువైందట.

అయితే, షార్క్‌లు మనుషులను వేటాడుతున్నాయనడానికి పెద్దగా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు… ఆహారంగా తీసుకునేందుకు మనుషులపై షార్క్‌లు దాడి చేస్తే, దాన్ని వేటగా భావించవచ్చు.సముద్రంలో మనుషులు ఎంతో సమయం గడుపుతుంటారు. మనుషులను వేటాడటం షార్క్‌లకు చాలా సులభం. కానీ, వాటికి మనల్ని తినాలన్న ఆసక్తి లేదట.దాడులు చేసే షార్క్ జాతులు పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే, వీటిలో ప్రధానమైనవి గ్రేట్ వైట్, టైగర్, బుల్ షార్క్‌లు. గ్రేట్ వైట్‌లపై హాలీవుడ్‌లో చాలా సినిమాలే తీశారు. ఆ మిగతా రెండు జాతులతో పోలిస్తే ఇవి పూర్తిగా భిన్నమైన జీవులు. షార్క్‌ల్లో దాదాపు 530 రకాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే రీతిన జతకట్టడం సరికాదు. వాటి శారీరక జ్ఞానం, ప్రవర్తన, అలవాట్లు, ఆవాసాలు.. ఇలా చాలా అంశాల్లో వైవిధ్యం బుల్ షార్క్‌లు చీకటిగా ఉండే లోతైన జలాల్లో వేటాడేందుకు ఇష్టపడతాయి. అవి తమ చూపుపై పెద్దగా ఆధారపడవు. వాసన, ఎలక్ట్రోసెప్షన్ సామర్థ్యాలను బాగా ఉపయోగించుకుంటాయి.
వైట్ షార్క్‌లు మాత్రం స్పష్టంగా, బాగా కనిపించే జలాల్లో వేటాడతాయి. వాటి దృష్టి సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.

జనాభా పెరుగుదలతోపాటు మనుషులపై షార్క్‌ల దాడులకు అనేక కారణాలు ఉన్నాయి.. షార్క్‌ల ఆవాసాలు నాశనమవ్వడం, నీటి నాణ్యత తగ్గడం, వాతావరణ మార్పులు, వేటాడే జంతువుల లభ్యత కొన్ని ప్రాంతాల్లో తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు…1992లో బ్రెజిల్‌లోని రెసిఫ్‌లో షార్క్‌ల దాడులు పెరిగాయి. అంతకుముందు పదేళ్లు అక్కడ అలాంటి ఘటనలు జరగలేదు. పోర్టు నిర్మాణం వల్ల అక్కడ జీవవైవిధ్యం దెబ్బతింది. షార్క్‌లు వేట కోసం వెతుక్కుంటూ రెసిఫ్ లాంటి ప్రాంతాలకు వచ్చాయని తేలింది. హిందూ మహాసముద్రంలో ఉండే రీయూనియన్ ద్వీపంలో 2011 తర్వాత 11 ప్రమాదకర షార్క్ దాడులు జరిగాయి. బాధితుల్లో ఎక్కువ మంది సర్ఫర్లే. వీరిలో కొందరు చేతులు, కాళ్లూ కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డారు.

చాలా సందర్భాల్లో మనుషులను తాము వేటాడాల్సిన చేపలుగా పొరబడి షార్క్‌లు దాడులు చేస్తుంటాయట..నీటిపై సర్ఫింగ్ చేసే వ్యక్తుల తెల్లటి పాదాలు షార్క్‌లకు తాము వేటాడే చేపల్లా కనిపించొచ్చు. టైగర్, వైట్ షార్క్‌లు చాలా వేగంగా కదులుతుంటాయి. అవి వేసే ఒక్క కాటైనా ప్రాణాలనే తీయొచ్చు.. గ్రేట్ వైట్స్ సాధారణంగా అడుగు నుంచి వచ్చి దాడి చేస్తాయి. వాటి కాటు తీవ్ర నష్టం కలిగించేలా ఉంటుంది. కొన్నిసార్లు అవి దాడి చేసి వెనక్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి వేటాడిన జీవిని తినేందుకు వస్తాయి. వివిధ ఫోరెన్సిక్ పద్ధతులను ఉపయోగించి షార్క్‌ల దాడుల తీరుపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

నీటి ఉష్ణోగ్రత 14 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, అమావాస్య మధ్యాహ్న సమయాల్లో గ్రేట్ వైట్ షార్క్‌లు ఉపరితలంలో కనిపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని దక్షిణాఫ్రికాలోని పరిశోధకులు గుర్తించారు. పౌర్ణమి రాత్రి సమయంలో గ్రేట్ వైట్ షార్క్‌లు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరో అధ్యయనంలో తేలింది.షార్క్‌ల దాడులను తప్పించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఒంటరిగా కాకుండా, గుంపులుగా ఈతకు వెళ్లాలి అని చెబుతున్నారు శాస్త్ర్రవేత్తలు.
ఈ క్రింద వీడియో చూడండి
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది. చేపల గుంపులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అవి నీటి నుంచి ఎగసిపడుతుంటే అత్యంత జాగ్రత్తపడాలి.ఆభరణాలు ధరించకూడదు. వాటిపై పడి ప్రతిబింబించే వెలుగు చూసి, అవి చేప పిల్లలై ఉండొచ్చని షార్క్‌లు భావించే అవకాశం ఉంది. నీటిని ఎక్కువగా చిమ్ముతూ చప్పుళ్లు కూడా చేయకూడదు. ఆ చప్పుళ్లకు షార్క్‌లు వచ్చే ప్రమాదం ఉంది…డైవింగ్ చేసేటప్పుడు నలుపు వంటి డార్క్ కలర్ వెట్ సూట్‌లను ధరిస్తే, షార్క్‌ల దృష్టి మన మీద పడకుండా చేసుకోవచ్చు. మొప్పల్లో గుద్దడం, కళ్లల్లో పొడవడం ద్వారా షార్క్‌లను ప్రతిఘటించవచ్చు. షార్క్‌లు మనుషులపై దాడుల చేసిన ఘటనలు ఉన్నట్లుగానే, అవి దగ్గరగా వచ్చి కూడా ఎవరికీ హాని తలపెట్టకుండా వెళ్లిన సందర్భాలూ అంతే సంఖ్యలో ఉంటున్నాయి. మరి చూశారుగా షార్క్ లు ఎంత ప్రమాదమో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్ర స్నానాల సమయంలో. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.
The post షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే నమ్మలేని నిజాలు appeared first on Telugu Messenger.