దుబాయ్…. ఒక అద్భుత నగరం. దుబాయ్ లో ఉన్న అద్భుతాలే దుబాయ్ ను ఇప్పుడు అగ్ర దేశాలలో ఒకటిగా నిలిపాయి.ఒకప్పుడు ఎడారితో చాలా చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు మహా నగరంగా మారింది.అలా మారి ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది.తన అందచందాలతో ఆకట్టుకుంటుంది దుబాయ్.ఉద్యోగాలు చెయ్యాలని కొందరు విసిట్ చేసి ఆనందంగా గడిపిరావాలని కొందరు వస్తుంటారు.ప్రపంచంలోనే మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా దుబాయ్ పేరొందింది.అలాంటి దుబాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలోని ఏడూ దేశాలలో దుబాయ్ ఒకటి. మిగిలినవి అబుదాబి, షార్జా, అజ్మన్, రాసల్ కైమా, ఫుజైరా, ఉమ్ అల్ కువైన్ .. మొదలైనవి. దుబాయ్ సరిహద్దులు ఉత్తరాన అబుదాబి, దక్షిణాన షార్జా, పశ్చిమాన ఒమన్, తూర్పున రస్ అల్ కైమా ఉన్నాయి.
- డిసెంబర్ 2 1971 న అబుదాబి మిగిలిన ఎమిరేట్స్ తో కలిసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహంగా ఏర్పడింది. 2007 లెక్కల ప్రకారం దుబాయ్ జనాభా 14 లక్షలమంది. అందులో 10 లక్షల 51 వేల మంది పురుషులు, 3 లక్షల 49 వేలమంది స్త్రీలు ఉన్నారు. వీరిలో ఆసియా వాళ్ళే 85 శాతం మంది ఉన్నారు. ఇందులో భారతీయులు 51 శాతం, పాకిస్తాన్ వాళ్ళు 16 శాతం ఉన్నారు.

- టూరిస్టు ప్లేస్ ల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న జబల్ అలిపోర్ట్ 1970 లో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మించబడిన అతిపెద్ద పోర్ట్. ఇక్కడ రైలు సౌకర్యం 2007 వరకు లేదు. దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి షేక్ జాయేద్ రోడ్డు. ఇది మొత్తం 12 లైన్స్ రోడ్డు. ఈ రహదానికి కంప్యూటర్ అనుసంధానం కలిగిన టోల్ గేట్స్ ఉన్నాయి.వీటిని సాలిక్ రోడ్డు టోల్ అని పిలుస్తారు. ఇవి రెండు చోట్ల ఉన్నాయి. వెహికల్ కు ముందు ఒక ట్యాగ్ అతికించి ఉంటుంది. వారికి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి.
- దుబాయ్ లో అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బయట తిరగకూడదు. అక్కడ ఎక్కువగా ముస్లిం యువతులు ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ మత ఆచారాలను తప్పకుండ పాటించాలి. లేకుంటే వారికి ఏమైనా చేసే హక్కు ఆ దేశ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు కూడాకొంచెం పద్ధతైన బట్టలు వేసుకోండి.

- ఇక దుబాయ్ లో మద్యపానం నిషేధం. మద్యం సేవిస్తే చట్టరీత్యానేరం. వారిని నేరుగా జైలుకే పంపిస్తారు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మద్యానికి అలో ఉంది. తాగాలనుకుంటే అక్కడికి వెళ్లే తాగాలి.
- 1970 వరకు ఒక్క పెద్ద బిల్డింగ్ కూడా ఈ దేశంలో లేదు.కానీ ఇప్పుడు దుబాయ్ లో మేఘాలను తాకే ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి.దుబాయ్ లో అన్నిటికన్నా పెద్దదైంది బుర్జ్ ఖలీఫా.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా పేరుగాంచింది.
- దుబాయ్ లో అక్కడి స్థానికుల ఫోటోలు తీయకూడదు. ఒకవేళ మీరు ఫోటోలు దిగితే అందులో అక్కడి స్థానికులు ఎవరైనవస్తే వారు మీ మీద కేసు పెట్టె హక్కు వాళ్లకు ఉంటుంది. అది అక్కడ తప్పు కాబట్టి మీరు ఇక జైలుకే.
- దుబాయ్ లో ఏది పడితే అది మాట్లాడకూడదు. మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కానీ దుబాయ్ లో అది లేదు కాబట్టి అక్కడ ఉండాలంటే నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి.
ఈ క్రింద వీడియో చూడండి
- మన దేశంలో బస్సు ల కోసం వెయిటింగ్ చెయ్యాలంటే సరైన సీటింగ్ ఉండదు. కానీ దుబాయ్ లో బస్సు స్టాప్ట్స్ అన్ని AC లతో ఉంటాయి. దుబాయ్ లో మొత్తం 70 వరకు షాపింగ్ మాల్స్ ఉంటాయి.అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి.ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ లోనే ఉంది.అందుకే దుబాయ్ ను షాపింగ్ క్యాపిటల్ అఫ్ మెడిలిస్ట్ అని అంటారు.
- ఏ దేశంలో అయినా స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా ఏ దేశం అయినా పాటలు పాడటాన్ని, డాన్సులు చేయడాన్ని ఎంకరేజ్ చేస్తుంది కానీ దుబాయ్ లో అలా ఉండదు. రోడ్ల మీద పాటలు పాడటం, డాన్సులు చెయ్యడం లాంటివి చెయ్యకూడదు.
The post దుబాయ్ హైవే రోడ్లపై జరిగేదేంటో తెలుసా.. 10 షాకింగ్ నిజాలు appeared first on Telugu Messenger.