తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రకటనలపై శ్రీవారి భక్తులు సహా పలువురు భగ్గుమన్నారు. తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్నా హజ్, జరూసలేం యాత్రలపై ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, స్వరూపానందేంద్ర స్వామి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలా కుట్రలు పన్నేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ స్వయంగా ఈ విషయంలో కలుగ జేసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అన్యమత ప్రచారం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కూడా ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుంది. తిరుమలకు వెళ్లు ఆర్టీసీ బస్సులను అధికారులు డిపోలోనే నిలిపివేశారు. ఏ ఏ బస్సులకు ఈ అన్యమత ప్రచార యాడ్స్ అతికించారో ఆ బస్సులన్నిటిని తిరుమల కొండపైకి వెళ్లనివ్వడం లేదు. ఇక రేపటినుంచి తిరుమల వెళ్లే ఏ బస్సులో అయినా సరే ఇలాంటివి కనపడితే ఆ బస్సును అక్కడే నిలిపేస్తామని అధికారులు హెచ్చరించారు. అన్యమత ప్రచారానికి సంబంధించి ముద్రణలు రాకుండా కండక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి జిల్లాలోని 14 డిపోల డీఎంలకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం తిరుపతి అలిపిరి చెకింగ్ పాయింట్, బాలాజీ లింక్ బస్టాండ్, ఏడుకొండల బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌రావు, అలిపిరి డిపో అసిస్టెంట్ డిపో మేనేజర్ నిర్మల తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలలో 100 మందితో 20 బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేసేందుకు రంగంలోకి దించారు. వీరితో పాటు ప్రత్యేక స్క్వాడ్‌ను అలిపిరి చెక్‌పాయింట్, బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఇకపై అన్యమత ప్రచారానికి సంబంధించి ఎటువంటి టికెట్లు కనిపించకూడదని కండక్టర్లు, డ్రైవర్లు, డీఎంలకు సూచించారు. ఎక్కడైనా పొరపాటున టిమ్ మిషన్లలో అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణలు ఉన్న టిక్కెట్ రోల్స్ కనిపిస్తే తక్షణం కాల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలలో తనిఖీలు నిర్వహించగా అన్యమత ముద్రరణలు ఉన్న 15 టిమ్‌రోల్స్ బాక్సులు లభ్యమమ్యాయి. వీటన్నింటిని శనివారం తిరుపతి ఆర్‌ఎం కార్యాలయానికి తరలించి స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు. తిరుమల డిపో నుంచి 4 బాక్సులు, మదనపల్లె-2 డిపో నుంచి 3, శ్రీకాళహస్తి డిపో నుంచి 1, పలమనేరు డిపో నుంచి 2, మంగళం డిపో నుంచి 3, కుప్పం డిపో నుంచి 2 బాక్సులు తనిఖీల్లో బయట పడ్డాయి. మరి తిరుమల బస్సులలో ఈ అన్యమత ప్రచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post తిరుమల వెళ్లే బస్సులు బంద్.. అసలేం జరుగుతుంది…. appeared first on Telugu Messenger.