తూర్పున సూర్యుడు ఉదయిస్తేనే మనకు రోజు మొదలవుతుంది. మరి వందల కోట్ల సంవత్సరాల నుంచి భగభగ మండుతూ వెలుగును, వేడిని ఇస్తున్న సూర్యుడు మండిమండి మాయమైతే? జీవరాశి మనుగడకు తోడ్పడుతున్న సూర్యుడే లేకపోతే అన్న ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. నిజమే సూర్యుడు లేకపోతే.. ఊహకు అందని విషయం… సూర్యుని గురించి మనకు ఎన్నో విషయాలు తెలుసు అనుకుంటాం. ఇంకా తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజూ మనకు కనిపించే సూర్యుడి వయసు ఎంతో తెలుసా 460కోట్ల సంవత్సరాలు. మరో 460కోట్ల సంవత్సరాల వరకు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. కారణం… సూర్యుడిపై ఉన్న హైడ్రోజన్ ఇది మండటానికి కారణం.. మరో 460కోట్ల సంవత్సరాల వరకు మండుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు మధ్యవయసులో ఉన్నాడన్న మాట. కాని కొందరు చెప్పేమాట? కొందరు అనుమానించే విషయం? సూర్యుడు అర్ధాంతరంగా మాయమైపోతే, అసలు ఈ భూమండలం ఏమవుతుంది, ఎక్కడో ఉన్న గ్రహల విషయం కాదు, మన భూమి అసలు ఉంటుందా అనేది చాలా మంది మదిని తొలిచే ప్రశ్న.. మరి ఈ రోజు ఈ విషయం పై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి సూర్యుడు మూలాధారం. మరి సూర్యుడు ఉదయించకపోతే అయ్యే మొదటి చర్య ఇదే, మొదటి ఎనిమిది నిమిషాలు భూమి మొత్తం చీకటిగా మారుతుంది…ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చంద్రుడు కనిపించడు,చంద్రుడు కనిపించాలి అంటే వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే సూర్యుడు లేడు కాబట్టి అది జరగదు.. ఇక చీకటి వల్ల మనిషి మూడ్ మార్చేస్తుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల మనుషుల మధ్య తీవ్ర హింస జరుగుతుంది ..పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు.. మొక్కలు ఆకులు ఫుడ్ తయారు చేసుకోలేవు, కిరణ జన్య సంయోగ క్రియ జరగదు. చేపలకు ఆక్సిజన్ సరిపోక సముద్రాలలో చనిపోతాయి…40 డిగ్రీల టెంపరేచర్ కేవలం 10 లేదా 8 కి పడిపోతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది.. సముద్రంలో చేపలకు అవసరం అయ్యే ఆక్సిజన్ సయోనా బ్యాకరీయా విడుదల చేయదు. దీంతో 24 గంటల్లో చేపలు చనిపోతాయి.చీకటి 24 గంటల వరకూ అలాగే ఉంటే మైనస్ 17 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోతుంది..

అయితే ఉష్ణమండల ప్రాంతాల్లో భూమి నుంచి వేడి బయటకు వస్తుంది.. ఇక్కడ కూడా కేవలం ఒకరోజు మాత్రమే వేడి ఉంటుంది.. ఇక సముద్రాలలో ఉండే నీరు చెరువులు నదులు ఈ నీరు మొత్తం కూడా గడ్డకట్టుకుపోతుంది. త్రాగడానికి నీరు దొరకదు. సముద్ర ఉపరితలాలు గడ్డకట్టుకుపోతాయి. అంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒక్క సూక్ష్మజీవులు తప్ప మరే జీవులు కూడా బ్రతకలేవు. అవి కూడా 48 గంటల్లో చనిపోతాయి. పోనీ బ్రతికినా కూడా ఏ పని చేయాలన్నా కూడా వాతావరణం సహకరించదు.సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అన్ని గ్రహాలను సూర్యుడు తనవైపు ఆకర్షించుకుంటాడు. అందుకే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు…..అదేంటంటె సూర్యుడు భూమిని ఆకర్షిస్తుంటే మరి భూమి సూర్యునికి దగ్గరగా వెళ్లి సూర్యునిలో కలిసిపోవాలిగా… కానీ అలా జరగట్లేదు కదా….. ఎందుకంటే భూమి సూర్యునిచేత ఆకర్షించినప్పటికీ ఒక నిర్ణీత కక్షలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే సూర్యుని నుండి భూమి ఒక నిర్దిష్ట దూరంలో, నిర్దిష్ట వేగంతో తిరిగేలా సూర్యుని ఆకర్షణ శక్తి పనిచేస్తుంది అన్నమాట.
ఈ క్రింద వీడియో చూడండి
పిల్లి కుక్క ఇలాంటి యానిమల్స్ కూడా ప్రాణాలతో ఉండలేక చనిపోతాయి.. సముద్ర ఉపరితలం కూడా ఐస్ గా మారిపోతుంది. ఎక్కడా నీరు ఉండదు, స్టోర్ చేసుకుని వాటిని వాడుకుందాం అన్నా ఆక్సిజన్ ఉండదు, మైనస్ 30 డిగ్రీలకు చేరుతుంది.. దీని వల్ల అనేక వ్యాధులు వస్తాయి, మంచు మినహ నేల ఉండదు, ధర్మల్ పవర్ దగ్గర మాత్రమే సూక్ష్మజీవులు ఉంటాయి. ఏడాది వరకూ సూర్యుడు రాకపోతే ఐర్లాండ్, ఐస్ లాండ్ లో మాత్రమే బతకవచ్చు, భూమిపై జియో ధర్మల్ యాక్టివిట్ ఇక్కడ ఉంటుది అందుకే ఇక్కడ బ్రతికే అవకాశం ఉంటుంది. అది కూడా మైనస్ 125 డిగ్రీలు వస్తే ఇక్కడ కూడా మనిషి బ్యాక్టిరీయా బతకదు, ఇక గ్రావిటీ పోతే మాత్రం మనిషి నిలవలేడు….ఆస్టరాయిడ్స్ మన భూమిని నాశనం చేయవచ్చు, రేడియేషన్ కు భూమి గురి అవ్వచ్చు , మరో రెండు మూడు రోజులకు సూర్యుడు వస్తేనే సాధారణం అవుతుంది. లేకపోతే భూమి దాదాపు సంవత్సరం లోపే ముక్కలు ముక్కలు అవుతుంది అని చెబుతున్నారు శాస్త్ర్రవేత్తలు, అయితే ఇలాంటి పరిస్దితి రాకూడదు అని కోరుకుందాం. మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.
The post సూర్యుడు లేకపోతే భూమి ఎలాగా ఉండేదో తెలుసా appeared first on Telugu Messenger.