Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

చంద్రుడి మీద ఏం జరిగింది.. అదంతా అబద్దం అని తేలింది

$
0
0

చంద్రుడిపై కాలు పెట్టడం అనేది సైన్స్ కే కాదు మానవుడి మేధా శక్తికి మచ్చు తునక. ఇంతకంటే గొప్ప ఘటన ఇంకొకటి ఉండదు. జులై 20, 1969 న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బస్ అల్ట్రీస్… చంద్రుడి మీద దిగిన వారీగా రికార్డ్ స్పృష్టించారు. మనిషి పుట్టుక పుట్టాకా అంతకన్నా గొప్ప ఖ్యాతి ఇంకొకటి ఉండదేమో. ఆ అద్భుతాన్ని ఆ రోజుల్లోనే ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించారు. చంద్రుడి మీద దాదాపు 2 గంటల పాటు గడిపారు. నీల్, బస్ లు చంద్రుడి మీద అమెరికా జెండాను పాతి తమ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. 50 ఏళ్ల నుంచి నాసా దానిని ఇంకా సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంది. అమెరికా ఇప్పటికి మేము చంద్రుడి మీదకు దిగాం అని సగర్వంగా చెప్పుకుని తిరుగుతుంది. అపోలో 11 మిషన్ అనేది ఇప్పటికి కూడా ఒక రికార్డ్. కానీ కాలక్రమేణా నాసా రిలీజ్ చేసిన ఫోటోలు వీడియోలు చూస్తుంటే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి.

Image result for చంద్రుడి మీద ఏం జరిగింది

అపోలో 11 మూన్ జర్నీ ఇప్పటికి కూడా ఒక రికార్డ్. ఒకరి తలకు ఉన్న వైజర్ లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అదే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అది మనిషి మాత్రం కాదు. యుఎప్ఓ లాంటివి ఏమైనా ఉండి ఉంటాయా అంటే బస్ మాత్రం తానూ ఏ యుఎప్ఓ లను చూడలేదని చెప్పాడు. ఏదో డబుల్ రిఫ్లెక్షన్ లాంటిదని చెప్పుకొచ్చాడు బస్. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మాత్రం దాని మీద నోరు కూడా మెదపలేదు. హెల్మెట్ లాంటి మాస్క్ కు ఉన్న ఫ్రంట్ గ్లాస్ పైన ఉన్న రిఫ్లెక్షన్ ఒకటి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ది అయితే పైన మరొక రిఫ్లెక్షన్ అనేది అనేక అనుమానాలకు దారి తీసింది. ఒకవేళ అక్కడ ఏలియన్స్ ఉన్నారనుకుందాం..ఒకవేళ ఏలియన్స్ ఉంటె వారిద్దరూ తిరిగి భూమి మీదకు వచ్చేవారు కాదు. మరి ఈ రిఫ్లెక్షన్ ఎవరిదీ.. వీరిద్దరూ కాకుండా అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే..ఉన్నారని కొందరు అంటున్నారు. కానీ అది నిజం కాదని అంటారు సైంటిస్టులు. ఈ అనుమానాలన్నిటిని పక్కన పెడితే అసలు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బస్ అపోలో స్పేస్ షిప్ లోకి వెళ్లలేదని కొందరి మాట. దానికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. కొన్ని ఫోటోలలో డబుల్ రిఫ్లెక్షన్స్ కనిపించాయి. ఈ ఫోటోలను చూస్తే ఫేక్ అని అనిపిస్తుంది. రష్యా కంటే ముందే మేము చంద్రుడి మీదకు వెళ్లాం అని అమెరికా గొప్పలు చెప్పుకోడానికే ఇలా ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేశాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ లో కనిపించే ఇమేజ్ లో ఫోకస్ లైట్ కనిపిస్తుంది. షూటింగ్ ల కోసం వాడే లైట్ స్పేస్ లో ఎలా ఉంటుంది. దీనిని అంతగా పట్టించుకోకుండా నాసా ఫోటోలను రిలీజ్ చేసింది.

Related image

ఇక మరొక విషయం ఏమిటంటే… చంద్రుడి మీద పాతిపెట్టిన జెండా గాలికి ఎగరడం మరొక మిస్టేక్. శూన్యంలో జెండా ఎలా ఎగిరింది అనేది అంతుచిక్కని ప్రశ్న. దీనిని నాసా సైంటిస్టు సమాధానం ఇచ్చాడు. చంద్రుడి మీద మట్టి తీయడానికి జెండా కర్రతో ప్రయత్నిస్తుండగా కదిలిందని చెప్పుకొచ్చాడు. ఆ సమాధానము మరిన్ని అనుమానాలను దారితీసింది. ఎవరు పట్టుకోనప్పుడు కూడా జెండా ఎగురుతూ కనిపించింది. దీనిని కావాలనే హాలీవుడ్ డైరెక్టర్ తో తీయించారని అప్పటికే 68 లో వచ్చిన 2001 స్పేస్ ఒడిసి మూవీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని చూపించింది. నేలపై చంద్రుడిని ఎలా చూపించవచ్చో డైరెక్టర్ స్టాన్లీ ప్రపంచానికి చూపించాడు. ఏడాది క్రితం వచ్చిన ఏ సినిమా డైరెక్టర్ తోనే అమెరికా ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. జెండా ఊగడం, రిఫ్లెక్షన్స్ కనిపించడం, మరికొన్ని చోట్ల నీడలు కూడా అనుమానం కలిగించేలా ఉన్నాయి. ఇక చంద్రుడికి వెలుగు కావాలంటే సూర్యుడే ఆధారం. ఎక్కువ వెలుతురు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని తీశారు ఈ వీడియో. కాకపోతే కాలం గడిచేకొద్దీ దొరికిపోయారు. ఇక అంతకముందు ప్రాజెక్ట్ అపోలో 11 ప్రారంభ దశలోనే పేలిపోయింది. ముగ్గురు ఆస్ట్రోనాడ్స్ తీవ్రంగా గాయపడ్డారు.

Related image

వాళ్ళు ముగ్గురు హాస్పిటల్ కు వెళ్తే ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా విషయం అందరికి తెలుస్తుందని అమెరికా గవర్నమెంట్ ఆ ముగ్గురిని చంపించిందని ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని నాసా కొట్టిపారేసింది. నిజానికి మేము చంద్రుడి మీద అడుగుపెట్టాం. అనుమానం ఉన్నవారికి మేము ఆధారాలు చూపించడం తప్ప ఇంకేమి చేయలేమని చెప్పారు. కనీసం వాళ్ళ ప్రభుత్వం లోని ఇండిపెండెంట్ లేదా లొవర్ట్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కు కూడా నాసా ఒప్పుకోలేదు. అమెరికా గవర్నమెంట్ కూడా తమ పరువు తాము ఎందుకు తీసుకుంటామని ఆ దిశగా స్పందించలేదు. ఇక నాసా ఆ తర్వాత చంద్రుడి మీద తామే మొదటిసారి కాళ్ళు పెట్టమని నిరూపించుకోడానికి నానా తంటాలు పడింది.

ఈ క్రింద వీడియో చూడండి

మరొకసారి చంద్రుడి ఫోటోలు తీసిన సైంటిస్టులు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నడిచిన ప్రాంతం, అపోలో దిగిన ఏరియా ఫోటోలను చూపించింది. అమెరికా జెండా చంద్రుడి మీద ఇంకా అలాగే ఉందని చెక్కు చెదరలేదని నిరూపించింది. అయినా సరే అందరిలో అనుమానమే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగాకా మరొకసారి చంద్రుడి మీద దిగి వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్న. ఇక ఇవన్నీ ఇలా ఉంటె 1969 లో అమెరికా ప్రకటించుకున్న చంద్రుడి ప్రాజెక్ట్ చూసి రష్యా నవ్వి ఊరుకుంది. ఇంతకూ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీదకు నిజంగానే దిగాడా అంటే నాసా అవునని అంటుంది కానీ కొంతమంది ఫేక్ అని అంటున్నారు. మరి ఈ విషయాలన్నీ విన్నాకా మీకేమనిపిస్తుంది. నిజంగానే అమెరికా చంద్రుడి మీద మొదటిసారి కాళ్ళు పెట్టిందా లేక ఇదంతా క్రియేట్ చేశారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

The post చంద్రుడి మీద ఏం జరిగింది.. అదంతా అబద్దం అని తేలింది appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles