బంగారం, వెండి కొనాలంటేనే జనాలు భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి. రోజు రోజుకు బంగారం పెరుగుతూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు. అయితే ఏ మధ్య బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోతుంది. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఇంకా ఎంత పెరుగుతదో అని భయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ఈరోజు కొంచెం తగ్గింది.. మరి మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..
.jpg)
పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.39,910కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 తగ్గుదలతో రూ.36,590కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.200 పెరుగుదలతో రూ.53,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.91 శాతం తగ్గుదలతో 1,497.10 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 1.46 శాతం తగ్గుదలతో 17.89 డాలర్లకు క్షీణించింది.
ఈ క్రింద వీడియో చూడండి
ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 తగ్గుదలతో రూ.38,600కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.37,400కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.200 పెరుగుదలతో రూ.53,200కు చేరింది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల ధర 36,607 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,487 గా ఉంది. విశాఖ పట్నం 22 క్యారెట్ల ధర 36,666 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,476 గా ఉంది. బెంగళూరు 22 క్యారెట్ల ధర 36,022 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,832 గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల ధర 36,634 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,464 గా కొనసాగుతున్నాయి. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇవేనండి ఈరోజు మార్కెట్ లో ఉన్న బంగారం ధరలు. మరి ఈరోజు ఉన్న బంగారం దరల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..! appeared first on Telugu Messenger.