చంద్రయాన్ 2 అప్ డేట్స్ కోసం ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు… విక్రమ్ లాండర్ నుంచి సమాచారం వస్తుందా అది పనిచేసి డేటా పంపుతుందా అని చూస్తున్నారు….తాజాగా ఇస్రో నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుంది అని చూస్తున్నారు, కాని ఈ సమయంలో మరో బాడ్ న్యూస్ చెప్పింది ఇస్రో, చంద్రుడి ఉపరితలంపై దిగినట్లు భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కావడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తోన్న ప్రయత్నాల్లో మరిన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి… ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం చేసిన తాజా ప్రకటన మరింత ఆందోళనకు గురి చేసేదిగా కనిపిస్తోంది.. జాబిల్లిపై అడుగు పెట్టే సమయంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ కు గురై ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు… క్రాష్ ల్యాండింగ్ కు గురైన తరువాత ల్యాండర్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫలితంగా- తాము నిరంతరాయంగా సంకేతాలను పంపిస్తున్నప్పటికీ.. వాటిని ల్యాండర్ గ్రహించట్లేదని అంటున్నారు.. అయినా తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని, ల్యాండర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేంత వరకూ విశ్రమించేది లేదని చెబుతున్నారు.

ఈ నెల 7వ తేదీన చంద్రుడిపై అడుగు పెట్టబోయే సమయంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియరాకుండా పోయిన విషయం తెలిసిందే… చంద్రుడి ఉపరితలం నుంచి సరిగ్గా 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సమయంలో ల్యాండర్ నుంచి బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు సంకేతాలు స్తంభించిపోయాయి. అప్పటి నుంచి ల్యాండర్ నుంచి ఎలాంటి డేటా గానీ, ఫొటోలు గానీ గ్రౌండ్ స్టేషన్ కు అందలేదు. దీనితో ఈ ప్రయోగం విఫలమైనట్లు భావించారు. అయినప్పటికీ.. ల్యాండర్ జాడను పసిగట్టడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు వృధాగా పోలేదు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే, నిర్దేశించిన ప్రదేశంలోనే ల్యాండర్ దిగినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. తాము ఊహించినట్టుగా సాఫ్ట్ గా ల్యాండింగ్ కాలేదని, క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. క్రాష్ ల్యాండింగ్ వల్లే ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయినట్లు ధృవీకరించారు.

అప్పటి నుంచి- ల్యాండర్ తో అనుసంధానం కావడానికి శాస్త్రవేత్తలు నిరంతరాయంగా చేస్తోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావట్లేదు. వివిధ రకాలుగా, విభిన్న రూపాల్లో సంకేతాలను ల్యాండర్ కు పంపిస్తున్నప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితమూ రాలేదు. దీనితో శాస్త్రవేత్తల్లో మరోసారి ఆందోళన వ్యక్తమౌతోంది. ల్యాండర్ ను గుర్తించి 48 గంటలు కావస్తున్నప్పటికీ.. దానితో అనుసంధానం మాత్రం కుదరకపోవడం శాస్త్రవేత్తలను అయోమయానికి గురి చేస్తోంది. ఈ 48 గంటల కాలంలో వారు కంటి మీద కునుకు లేకుండా అనుసంధాన ప్రయత్నాలు కొనసాగించారు. ఎలాగైనా ల్యాండర్ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ.. ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. దీనితో- విక్రమ్ ల్యాండర్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి శాస్త్రవేత్తల్లో. చంద్రుడి ఉపరితలం మీద క్రాష్ ల్యాండింగ్ కు గురైనప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఆశించారు. అదే సమయంలో- ల్యాండర్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందని అనుమానిస్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
ల్యాండర్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం అంటూ జరిగితే.. దానితో అనుసంధానం కావడం మరింత కష్టతరమౌతుందనే భయాందోళనలు శాస్త్రవేత్తల్లో వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. సైలెంట్ మోడ్ లో ఉన్న సమయంలో అందులోని ఏ ఒక్క పరికరం కూడా పనిచేయవు అంటున్నారు. ల్యాండర్ లోని అన్ని పరికరాలు సైలెంట్ మోడ్ లో ఉంటాయి.. దీని వల్ల తాము పంపించే శబ్ద తరంగాలను అవి గ్రహించలేకపోతున్నాయని చెబుతున్నారు. ల్యాండర్ క్రియాశీలకంగా ఉండి ఉంటే.. ఇస్రో శాస్త్రవేత్తలు పంపించే అత్యాధునికమైన సంకేతాలను ఈ పాటికి గ్రహించి ఉండేదని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ- తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కాగలమనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికీ.. సంకేతాలను గ్రహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి చూడాలి వారి ప్రయత్నాలు ఫలించాలని మనం కూడా కోరుకుందాం.
The post సైలెంట్ మోడ్ లో విక్రమ్ ల్యాండర్ భయంకరమైన విషయం చెప్పిన ఇస్రో appeared first on Telugu Messenger.