ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించి చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా సంగతి మనకు తెలిసిందే. 95 శాతం సక్సెస్ సాధించినా కూడా 5 శాతం ఫెయిల్ అవ్వడంతో భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే విఫలం అయినా మరుసటి రోజే ల్యాండర్ విక్రమ్ ఆచూకీని మన సైంటిస్టులు కనుగొన్నారు. అయినా కానీ దానితో సిగ్నల్స్ లేవు. ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి నిరంతరాయంగా సంకేతాలను పంపిస్తున్నప్పటికీ అందులో ఏ ఒక్క దాన్ని కూడా ల్యాండర్ గ్రహించట్లేదు. ల్యాండర్ జాడను పసిగట్టిన 24 గంటలు అవుతోంది. ఈ వ్యవధిలో ఇస్రో శాస్త్రవేత్తలు కొన్ని వందల సంఖ్యలో సంకేతాలను ల్యాండర్ కు పంపించారు. ఆ సంకేతాలకు ల్యాండర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావట్లేదని తెలుస్తోంది. నిరాశ చెందని శాస్త్రవేత్తలు నిరంతరాయంగా వివిధ సాంకేతిక రూపాల్లో సంకేతాలను పంపిస్తూనే ఉన్నారు. వచ్చే రెండు వారాల్లోగా తాము విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానమౌతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి పంపిస్తోన్న సంకేతాలకు విక్రమ్ ల్యాండర్ స్పందించకపోవడానికి చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులే కారణమై ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్త మైలాస్వామి అన్నాదురై అభిప్రాయపడ్డారు. చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కూడా ఇందుకు ఓ కారణం అయ్యుంటుందని ఆయన అంచనా వేశారు. మైలాస్వామి అన్నాదురై.. చంద్రయాన్-1 ప్రాజెక్టుకు డైరెక్టర్ గా పనిచేశారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగే సమయంలో సంభవించిన పరిణామాల వల్లే దానితో సంబంధాలు తెగిపోయి ఉంటాయని అన్నారు. ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం మీదే దిగిందనడానికి సహేతుకమైన, శాస్త్రీయబద్ధమైన రుజువు ఇదేనని చెప్పారు. చంద్రుడి మీద దిగిన తరువాత తలెత్తిన కొన్ని అడ్డంకుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పంపించే సంకేతాలను ల్యాండర్ లోని సిగ్నల్ రిసీవర్లు అందుకోవట్లేదని చెప్పారు. చంద్రయాన్-1 మిషన్ లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే తలెత్తిన విషయాన్ని మైలాస్వామి అన్నాదురై ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్-1కు చెందిన ఆర్బిటర్ నుంచి వెలువడిన సంకేతాలు ల్యాండర్ కు చేరుకున్నాయని అన్నారు. విక్రమ్ ల్యాండర్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఇస్రో పంపిస్తున్న సంకేతాలకు ఇక ముందైనా ల్యాండర్ స్పందిస్తుందా? లేదా? అనే అంశం మీదే ఈ ప్రాజెక్టు విజయం ఆధారపడి ఉందని చెప్పారు. సాధారణంగా ల్యాండర్ నుంచి ఆర్బిటర్ మధ్య పరస్పర సంకేతాల మార్పిడి యథాప్రకారం కొనసాగుతుంటుందని, ల్యాండర్ కు సంకేతాలు పంపించాలంటే గ్రౌండ్ స్టేషన్ నుంచే సాధ్యపడుతుందని అన్నారు. ల్యాండర్ తో అనుసంధానమైనప్పటికీ అది అయిదు లేదా పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎదురైన క్లిష్ట పరిస్థితులను మన శాస్త్రవేత్తలు అధిగమించగలరనే తాను ఆశిస్తున్నానని అన్నారు. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ – 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ కోసం అన్వేషిస్తున్నామని అన్నారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతూనే వచ్చింది. వారి ప్రయత్నాలు విఫలం కాలేదు. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన సుమారు 36 గంటల వ్యవధిలోనే దాన్ని గుర్తించారు. బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను తెగిపోయిన అనంతరం విక్రమ్ ల్యాండర్.. క్రమంగా ఉత్తర ధృవం వైపు కదులుతున్నట్లు తేలింది. చూడాలి మరి సైంటిస్టులు దానికి సిగ్నల్స్ కనెక్ట్ చేస్తారో లేదో. మరి చంద్రయాన్ 2 విషయంలో సైంటిస్టు మైలాస్వామి అన్నాదురై చేసినా కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post ల్యాండర్ ఆచూకీ దొరికినా..: చంద్రయాన్-2పై ఇస్రో శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు appeared first on Telugu Messenger.