Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

కన్నీటిపర్యంతమైన ఇస్రో ఛైర్మన్.. దగ్గరకు తీసుకుని ఓదార్చిన మోదీ.. నెటిజన్లు ఫిదా!

$
0
0

విజయం సాధించినప్పుడు అభినందనలు తెలియజేయడం, పొగడ్తల్లో ముంచెత్తడం సర్వసాధారణం. కానీ, పరాజయం ఎదురైనప్పుడు వారికి నేనున్నాను.. అధైర్యం వద్దంటూ వెన్నుతట్టి ధైర్యం చెప్పేవారు ఉండాలి. సరిగ్గా ప్రధాని మోదీ ఇలాంటి పనే చేశారు. శనివారం తెల్లవారుజామున బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను తిలకించడానికి వచ్చిన ప్రధాని మరోసారి తాను మిగతా నాయకుల కంటే భిన్నమనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలోనే విక్రమ్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు.

Image result for isro chairman and modi

ఇదే సమయంలో ధైర్యంగా ఉండండి.. దేశం యావత్తు మీ వెంట ఉందంటూ ప్రధాని మోదీ అన్నారు. ప్రధానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన ఇస్రో ఛైర్మన్ శివన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయి కన్నీళ్లుపెట్టుకున్నారు. ఈ సున్నితమైన, ఉద్వేగభరిత సందర్భాల్లో మోడీ స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శివన్‌ ను దగ్గరకు తీసుకుని ఆయన ఓదార్చి విధానం అందర్నీ ఆకట్టుకుంది. చంద్రయాన్-2 అత్యంత కీలకమైన ప్రాజెక్టు. మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పోటీపడాలని ఇస్రో సంకల్పించింది. అయితే అదంత సులవుకాదని విషయం ఇస్రోకు ముందే తెలుసు. రాకెట్ ప్రయోగించడం, చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వరకూ అంతా సాఫీగా సాగిపోయాయి కానీ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలం మీదకు క్షేమంగా దింపడమే అసలు సిసలైన పరీక్ష. గతంలో అనేక ప్రయోగాలు అక్కడే ఆగిపోయాయి. ఆరు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తోన్న ల్యాండర్ వేగాన్ని అమాంతం తగ్గించి సురక్షితంగా దక్షిణ ధృవం మీదకు దింపడమంటే ఆషామాషీ కాదు.

ఈ క్రింద వీడియో చూడండి

మన చంద్రయాన్-2 కూడా కిలోమీటర్ల ఎత్తుదాకా అనుకున్నట్టుగానే పయనించి, అక్కడే నిరాశపర్చింది. ల్యాండర్ విక్రమ్ చివరి క్షణాల్లో చంద్రుడిపై ముద్ర వేయలేకపోవడంతో ఇస్రో కేంద్రం మొత్తం దాదాపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎన్నో ఏళ్ల శ్రమ, ఖర్చు, నిరీక్షణ, ప్రయత్నం అన్నీ ఆ చివరి క్షణాల్లో దూరమయ్యాయి. అందుకే ఇస్రో సైంటిస్టులు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదే సమయంలో మోడీ దైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండండి, ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు, దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందని భరోసా ఇచ్చారు. తన కాన్వాయ్ ఎక్కేసి, వెళ్లిపోతుండగా వీడ్కోలు చెప్పటానికి శివన్ గేటు దాకా వచ్చారు. ఆయనకు దుఖం తన్నుకురాగా కళ్లల్లో నీళ్లు చూసిన మోదీ కూడా చలించి, హత్తుకున్నాడు. కాసేపు అలాగే శివన్ వెన్నుతడుతూ ఓదార్చారు.. అక్కడున్న అందరిని ఈ దృశ్యాలు కదిలించాయి. వైఫల్యం చీకట్లో ప్రధాని ఇస్రో వెంట నిలబడ్డ తీరు అభినందనీయం. సోషల్ మీడియా కూడా ఈ విషయంలో ఇస్రోకు బాసటగా నిలవడం విశేషం. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం ఎంతో అతృతతో ఎదురుచూసిన చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం కాస్త బాధించే అంశమే. మరి చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

The post కన్నీటిపర్యంతమైన ఇస్రో ఛైర్మన్.. దగ్గరకు తీసుకుని ఓదార్చిన మోదీ.. నెటిజన్లు ఫిదా! appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles