ఈ కలియుగంలో ప్రపంచంలో మంచి వారు మాత్రం ముందు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.. మతోన్మాధం ఉగ్రవాదం ఇలా అనేక కారణాల వల్ల అమాయకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, కుట్రలు కుతంత్రాలు మత ఉన్మాదం అవినీతి అక్రమాలు ఇలా అనేక విషయాలు సాధారణ జీవితం గడిపే వ్యక్తులని చనిపోయేలా చేస్తున్నాయి, ఈ సొసైటీలో మంచిగా ఉంటే ఎక్కువ కాలం ఉండలేము అనేలా మార్పు వస్తోంది, మంచికి చోటు అనేది కనిపించడం లేదు, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు అనేలా మారిపోయింది ఈ కలికాలం.

అయితే సమాజంలో చెడు ఎందుకు ఇలా తాండవం చేస్తోంది, మంచి కనుమరుగు అవుతోంది అంటే ,మనిషి స్వార్ధం అనే చెప్పాలి, నా అనుకునే ప్రతీ ఒక్కరూ కూడా తమ వారి కోసం కష్టపడుతూ ఇతరులను మోసం చేస్తున్నారు, ఇతరులు కూడా ఇలాగే ఆలోచించి తన కుటుంబం అని పరితపిస్తున్నారు. అందుకే సమాజంలో ఇలా వైషమ్యాలు కులాలు మతాలు విద్వేషాలు రొజుకొకటి పుట్టుకువస్తున్నాయి , మనది నూరేళ్ల జీవితం, దీనికి మతం కులం అనే ట్యాగ్ లైన్లు తగిలిస్తున్నారు. అందులో ఎవరు ఎంత కాలం బతుకుతారో తెలియదు, కాని బతికిన కాలంలో కచ్చితంగా తమ కులం తమ కుటుంబం తమ మతం ఇలా అనుకుని సగం జీవితం నాశనం చేసుకుంటున్నారు.

ఆ భగవంతుడు కూడా అలాగే చూస్తున్నాడు. మంచి వారికి భూమి మీద చోటు లేదు అనేలా వారినే ముందు తీసుకువెళుతున్నాడు, చెడు చేసేవారిని మాత్రమే భూమిపై పెంచుతున్నాడు, కటికి పేదరికంలో ఉన్న వ్యక్తి అలాగే ఉంటున్నాడు, కాని మిలియనీర్ మాత్రం బిలియనీర్ అవుతున్నాడు, అమ్మా ఆకలి అనేవాడికి తిండి దొరకడం లేదు, కాని ధనవంతుడు రోజుకి కొన్ని కిలోల ఆహరం వేస్ట్ చేస్తున్నాడు, నిజంగా ఇలాంటివి చూసిన సమయంలో దేవుడు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది .. వారి పాప పుణ్యాలను బేరీజు వేసుకుని ఈ యుగంలో శిక్ష విధిస్తున్నాడు అని చెబుతారు..అసలు తప్పు చేసిన యుగంలోనే శిక్ష విధించవచ్చు కదా అనేది సగటు మనిషి ప్రశ్న,
ఈ క్రింద వీడియో చూడండి
మంచి వారికి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏ చేయి మీకు వచ్చిన సమస్యలను తీర్చదు, ఏ చేయి నీ కంటి నుంచి వచ్చే కన్నీరు తుడవదు, నీకు నువ్వు దైర్యం చెప్పుకోవాలి. నీకు నువ్వు భరోసా కల్పించుకోవాలి.. ఎవరూ మనల్ని ఆపదల నుంచి కాపాడరు, రాముడికి, మహమ్మద్ ప్రవక్తకు, ఏసయ్యకు, బుద్దిడికే కష్టాలు తప్పలేదు, నువ్వెంత? అందుకే భయం లేకుండా జీవించు పోరాటం చెయ్యాలి, అలసట నీ విజయాన్ని ఆపుతుంది అందుకే ఎక్కడా ఆగద్దు విజయం సాదించే వరకూ ముందుకు నడవాలి. ఒకరికి అపాయం చేయకుండా ఎవరిని నమ్మకుండా ముందుకు నడు, నీ విజయం ఇప్పుడు కాకపోయినా కచ్చితంగా ఏదో ఒక చోట నీకు వెల్ కమ్ చెబుతుంది, మంచి వారికి కష్టాలు అనేది నిజమే, అలా అని చెడుగా మారితే ప్రపంచం చెడుగానే చూస్తుంది, అందుకే నీవు నీలా ఉండాలి, ఆలోచన ఆచరణ రెండూ మారాలి. అది నీ విజయానికి కేరాఫ్ అడ్రస్ అవ్వాలి. నీకు చెడు చెయ్యాలి అని అనుకునేవారితో నీ పతనం కోరుకునే వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
The post ఎందుకు మంచివారికి ఎక్కువ కష్టాలు వస్తాయి appeared first on Telugu Messenger.