సమాజంలో గతంలో ట్రాన్స్ జండర్స్ ని చాలా దారుణంగా చూసేవారు కాని నేటి సమాజంలో వారికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది.. వారి అభిరుచులకు తగిన విధంగా బతుకుతున్నారు. సమాజంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతున్న ట్రాన్స్ జండర్స్ చాలా మంది ఉన్నారు.. అయితే ట్రాన్స్ జండర్ గా తనకాళ్లపై తాను నిలబడి ఓ చరిత్ర సృష్టించిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.ఇంతవరకు మనం ఒక ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్ అవ్వడం చూశాం.. మన దేశంలో ఒక ట్రాన్స్ జెండర్ తమిళనాడులో తొలిసారిగా సబ్ ఇన్ స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన విషయం గురించి విన్నాం.. కానీ ప్రస్తుతం ఇప్పుడు తెలుసుకోబోయే ట్రాన్స్ జెండర్ గురించి వింటే మీరు కచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఆమె ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప్రవేశించిన ట్రాన్స్ జెండర్. క్యాబ్ డ్రైవర్ గా మారి ప్రతి బుకింగ్ లోనూ 5 స్టార్ సాధిస్తోంది. అందరికీ షాకిస్తోంది. ఇంతకీ ఆ ట్రాన్స్ జెండర్ ఎవరు.. ఆమె ఎందుకు క్యాబ్ డ్రైవింగ్ నే వృత్తిగా ఎంచుకున్నారు. ప్రతి బుకింగ్ కూ 5 స్టార్ ఎలా సాధిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాన్స్ జెండర్ అంటే ప్రస్తుత సమాజంలో అందరికీ చిన్నచూపే. ఎందుకంటే వారు కూడా మనలాగే మనుషులని, వారు కూడా మనలా బతకాలని అనుకున్నా ఈ సమాజం వారికి అలాంటి అవకాశాలు ఇవ్వదు. పైగా వారిని హీనంగా చూస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా వారిని అణగదొక్కాలనుకుంటుంది. పదే పదే వారిని అవమానిస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో అడ్డంకులను అధిగమించింది ఆ ట్రాన్స్ జెండర్. క్యాబ్ డ్రైవర్ గా 5 స్టార్ సాధించిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ట్రాన్స్ జెండర్ ఎవరంటే రాణి కిన్నారా.ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివసించే రాణి కిన్నా క్యాబ్ డ్రైవర్ గా వృత్తిని ప్రారంభించించింది.. ఆమె ఆ నగరంలో అందరికీ ఇష్టమైన డ్రైవర్ గా మారిపోయింది. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఉబర్ తరపున 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డు నెలకొల్పింది. అయితే ఆమెకు ఈ విజయం ఊరికే దక్కలేదు. దీనికి వెనుక ఆ ట్రాన్స్ జెండర్ కఠోర శ్రమ ఉంది.

డ్రైవింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లో అంటే తన కెరీర్ ప్రారంభంలో తనకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. తనను డ్రైవర్ గా సమాజం అంగీకరించలేదు. కనీసం తనకు మద్దతు కూడా రాలేదు. దీంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందింది. అప్పుడే పూరిలోని పవిత్ర రథయాత్ర సందర్భంగా అంబులెన్సు కోసం డ్రైవర్ గా స్వచ్ఛందంగా పని చేయాలని నిర్ణయించుకుంది.ఇది చూసిన ఓ మాజీ ఉబర్ ఉద్యోగి రాణిని క్యాబ్ డ్రైవింగ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అలా ఆ ట్రాన్స్ జెండర్ డ్రైవర్గా ప్రోత్సహించారు. 2016లో డ్రైవింగ్ మొదలు పెట్టింది. 2017లో అంబులెన్స్ డ్రైవర్ గా మారింది. ఆ తర్వాత ఉబర్ లో చేరి తిరుగులేని విజయం సాధించింది. అంతేకాదండోయ్ ప్రస్తుతం ఆమె ఒక సొంత కారును కూడా కొనుగోలు చేసింది. దీంతో హిజ్రాల సంఘం నుండి ఎక్కువ మంది సగర్వంగా తల ఎత్తుకుని స్వయం ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారందరికీ ఈ ట్రాన్స్ జెండర్ రాణి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
మరి కొంత మంది రాణికి అభిమానులు, అనుచరులుగా మారిపోయారు. వారంతా తాము కూడా డ్రైవర్ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. ”ముఖ్యంగా మహిళలకు ప్రమాదకరమని అనిపించే మగ డ్రైవర్లతో పోల్చితే తమతో ప్రయాణించేటప్పుడు చాలా సురక్షితంగా ఉంటారు” అని ఆ సంఘానికి చెందిన మరో ట్రాన్స్ జెండర్ చెప్పారు. ఇది ఆమె సక్సస్ స్టోరీ మరి ఆమె విజయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.
The post ప్రపంచంలో నెంబర్ వన్ ట్రాన్స్ జండర్ ఆమె సక్సస్ స్టోరీ appeared first on Telugu Messenger.