సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదఘటన ఎవరూ మర్చిపోలేకపోతున్నారు.. ఈ సమయంలో బోటులో ఉన్న చాలా మంది ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. మరో పక్క ఆ బోటుని నది నుంచి బయటకు తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది మాత్రం సాధ్యం కావడం లేదు…దీంతో ఆచూకి తెలియని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు..గోదావరిలో జరిగిన బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తృటిలో ప్రమాదం తప్పింది. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో వెళ్లిన బోటు సైతం వరద తాకిడికి గురై ప్రమాదానికి గురైంది. మృతులను గాలిస్తున్న సమయంలోనే ఎన్డీఆర్ఎఫ్ బోటు బోల్తా పడి మునిగిపోయింది. అయితే సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో ఎలాంటీ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డారు.

కాగ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత పది రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాద మృతుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ప్రమాదంలో ఇంకా పదమూడు మంది ఆచూకి కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి.సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 36 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తుండగా రోజుకో శవం బయటపడుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడతో గాలింపు చర్యలకు బ్రేక్ పడుతోంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన , నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు వెనక్కి వెళ్లాయి.
ఈ క్రింద వీడియో చూడండి
అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో రోజువారి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రెండు గంటల్లో బోటుని బయటకు తీస్తామ అని చెబుతున్నా వారిని కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు, ఎందుకంటే ఎలాంటి సేఫ్టీ లేకుండా బోటుని తీస్తామంటున్నారు. దీంతో వారి ప్రాణాలకు కూడా ఇది రిస్క్ అని చెబుతోంది ప్రభుత్వం. ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అవడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఏదైనా వరద తగ్గుముఖం పట్టి భారీ వర్షాలు ఆగిన తర్వాత మాత్రమే, ఇక్కడ పడవను బయటకు తీసే అవకాశం ఉంది అంటున్నారు ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు.
అయితే ఇలా మరో బోటు బోల్తా పడింది అనే విషయం సీఎం జగన్ కు తెలియడంతో, అన్నీ జాగ్రత్తలు తీసుకుని మాత్రమే గోదావరిలో అన్వేషన చేయాలి అని అధికారులకు సూచించారట సీఎం జగన్.
The post బ్రేకింగ్: గోదావరిలో మరో బోటు బోల్తా.. షాక్ లో జగన్ appeared first on Telugu Messenger.