సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో విధుల్లో ఉన్న తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి చంపిన ఘటన అందరినీ కలచివేసింది. విజయారెడ్డి మృతి చెందడంతో ఆమె స్వస్థలమైన మునుగోడు మండలంలోని కల్వలపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తమ గ్రామానికి చెందిన తహసీల్దార్ విజయారెడ్డిని విధుల్లో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారన్న విషయం తెలియగానే ప్రజలు, వారి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. పండుగలకు తన అత్త, మామల వద్దకు వస్తూ ఇక్కడే పండుగలు జరుపుకునే విజయారెడ్డి ఇకలేరనే చేదు నిజాన్ని అక్కడి ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆమె ఊరికి వచ్చిన సమయంలో అందరితో కలివిడిగా ఉంటూ అందరి బాగోగులు అడిగి తెలుసుకునేదని స్థానికులు చెబుతున్నారు.

శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు లింగారెడ్డి, వినోదమ్మల కుమారై విజయారెడ్డి. కల్వలపల్లి గ్రామానికి చెందినా పుట్ట దశరథరెడ్డి-లలితమ్మ దంపతుల చిన్న కుమారుడు సుభాష్ రెడ్డితో 2007 మే నెలలో విజయారెడ్డికి వివాహం చేశారు. సుభాష్ రెడ్డి పీజీ పూర్తిచేసి నల్గొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేసేవారు. కాగా, సుభాష్ 2014లో డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ అధ్యాపకుడి ఉద్యోగం సాధించి హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. విజయారెడ్డికి వివాహం కాక ముందే ఎస్జీటీ ఉద్యోగం వచ్చింది. విధుల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, చిమిర్యాల ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసింది. వివాహం చేసుకున్న తరువాత విజయారెడ్డి తన భర్తతో కలసి నల్లగొండలో ఉంటూ నారయణపురం మండలంలో విధులు నిర్వహించేది. వీరికి ఇద్దరు పిల్లలు.. కుమార్తె సాయిచైత్ర, కుమారుడు భువన సాకేత్ ఉన్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న విజయారెడ్డి ఉన్నత ఉద్యోగం సాధించాలని 2008లో గ్రూప్ 2 పరీక్ష రాసింది. 2009లో వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో ఆమెకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం లో చేరిన ఆమె మొదట మెదక్ జిల్లా సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించింది. ఆ తరువాత అదే జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేయడంతో దానిలో భాగంగా ఆమె తహసీల్దారుగా పదోన్నతి పొంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో విధులు నిర్వహిస్తుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తొలి తహసీల్దార్‌గా 3 ఏళ్ల నుంచి ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాదే విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరించేవారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వనస్థలిపురంలోని సొంత ఇంటిని అద్దెకు ఇచ్చి, పాఠశాలకు సమీపంలో కొత్తపేట గ్రీన్‌హిల్స్‌కాలనీలో నివసిస్తున్నారు. విజయారెడ్డి తండ్రి లింగారెడ్డి రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొంది, న కిరేకల్‌లో ఉంటున్నారు. లింగారెడ్డి కుమారుడు ధర్మారెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలోనే బలవన్మరణానికి పాల్పడగా, ప్రస్తుతం విజయారెడ్డి కూడా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. లింగారెడ్డి పెద్ద కుమార్తె సంధ్యారాణి నకిరేకల్ మండలంలోని కురిమేడ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉత్తమ ఎమ్మార్వోగా.. MRO విజయారెడ్డి ప్రస్థానం appeared first on Telugu Messenger.