Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ఆపరేషన్‌ చేయించుకున్నాడు

$
0
0

సమాజంలో రోజురోజుకు వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది చేసే పనులు చూస్తుంటే వారిది పిచ్చి అనుకోవాలో లేక వేరే అనుకోవాలో కూడా అర్థం అవ్వడం లేదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో హద్దులు దాటిపోతున్నాయి. ప్రేమ మైకంలో పడి అసాధ్యం అనుకున్న పనులను కూడా సాధ్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి మరొక అమ్మాయిని ప్రేమించింది. అంతేనా ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద త్యాగమే చేసింది.

Woman Undergoes Gender Change Operation For Girlfriend--Woman Undergoes Gender Change Operation For Girlfriend-

కేరళ రాష్ట్రం దేవభూమికి చెందిన అర్చన మరియు అన్వేషితలు మంచి స్నేహితులు. వీరి స్నేహంను చూసిన కొందరు ప్రేయసి ప్రియుడులా తెగ తిరిగేస్తున్నారుగా అనుకునేవారు. వారు మొదట తమ స్నేహంను చాలా లైట్‌గానే అనుకున్నా కాలం గడుస్తున్నా కొద్ది వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడినది. దాంతో వారిద్దరు జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు ఆడవారు అవ్వడం వల్ల అది సాధ్యం కాదని వారికి తెలుసు. ఒకవేళ మొండిగా ఉండాలనుకున్నా కుటుంబ పెద్దలు ఒప్పుకోరు. అందుకే ఆ స్నేహితుల్లో ఒక అమ్మాయి అయిన అర్చన లింగ మార్పిడికి సిద్దం అయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో చెన్నైలో దాదాపు మూడున్నర లక్షలు ఖర్చు చేసి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది. లింగ మార్పిడి తర్వాత అర్చన కాస్త దీపు రాజ్‌ గా పేరు మార్చుకున్నాడు. పూర్తిగా కుర్రాడులా మారిపోయిన అర్చన ఉరఫ్‌ దీపు రాజ్‌ తన ప్రియమైన అన్వేషిత వద్దకు చాలా ఉత్సాహంగా వెళ్లాడు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు, పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్‌ పెట్టాడు. కాని అన్వేషిత మాత్రం మొహం చాటేసింది. పెళ్లికి ఆసక్తి చూపలేదు. పైగా తనకు పెళ్లి కుదిరిందని పెద్ద బండరాయి నెత్తిన వేసినంత పని చేసేలా చెప్పింది. అన్వేషిత మారిపోవడంతో దీపుకు ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరు అయ్యాడు. ఎలాగైనా ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాని అన్వేషిత మాత్రం ఒప్పుకోలేదు. దాంతో దీపు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు. అన్వేషితను పిలిచి ఎంక్వౌరీ చేసిన పోలీసులతో దీపు మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేసింది. మా ఇద్దరి మద్య పెళ్లి చేసుకోవాలనుకునేంత ప్రేమ లేదని, తనకు తాను ఊహించేసుకుని ఆపరేషన్‌ చేయించుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్వేషిత మాటలకు దీపు గుండెలు పలిగినంత పనైంది. ప్రేమించి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుని ఆపరేషన్ చేయించుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న దీపు దీనగాథ పోలీసులకు కూడా కన్నీరు తెప్పించింది.

ఈ క్రింద వీడియో చూడండి

The post ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ఆపరేషన్‌ చేయించుకున్నాడు appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles