ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పు అంటింది ఆమెని అతి దారుణంగా చంపాడు రైతు సురేష్. ఇది అమానుష చర్యగానే చెప్పాలి, అధికారులపై ఆరోపణలు విన్నాం కాని ఇలా పగ తీర్చుకునే విధంగా మనిషి మారిపోతున్నాడు అంటే పరిస్ధితి దారుణంగా మారిపోతోంది, అయితే ఇదొక్కటే కాదు రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్ .ఫుడ్ ఇన్సెక్టర్ ఆఫీసుల్లో, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో కొందరు లంచాలకు మరిగిపోయారు… ఇలాంటి వారికి ఇప్పుడు విజయారెడ్డి గతి పడుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు, అయితే ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు, దీనిపై కచ్చితంగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వాలని చెబుతున్నారు ఉన్నత అధికారులు, ఎవరైనా లంచాలు అడిగినా మీ పనులు చేయకపోయిన నేరుగా కంప్లైంట్ ఇవ్వండి ని భరోసా ఇస్తున్నారు ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదు అంటున్నారు.

ఈ సమయంలో తెలంగాణలో ఓ విఆర్వోని తాను ఇచ్చిన 2000 లంచం తిరిగి ఇవ్వాలని ఓ మహిళ డిమాండ్ చేయడం చూశాం, అతనిపై చర్చలకు ఉన్నతాధికారులు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఏపీలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పరిష్కరించడం లేదంటూ కడప జిల్లాలో ఓ రైతు ఏకంగా తహశీల్దార్ చాంబర్‌లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు.
ఈ క్రింద వీడియో చూడండి
కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామం 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఇందులో 3.50 ఎకరాల భూమికి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. మిగిలిన భూమిపై వివాదం ఉంది. ఇందులో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందని, చాలాకాలం నుంచి తమ ఆదీనంలో ఉందని, ఆ భూమిని తన తల్లి పేరుమీద ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ బుడిగి ఆదినారాయణ అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల నుంచి ఆన్‌లైన్‌లో భూమిని నమోదు చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆదినారాయణ పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ చాంబర్‌లోకి ప్రవేశించి, తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డి ఎదుట తన ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆదినారాయణను పక్కకు లాగి నీళ్లు చల్లి పోలీసులకు అప్పగించారు. 1989 నుంచి ఆ భూమి మా తండ్రి అనుభవంలో ఉన్నా ఆన్‌లైన్ చేయకపోవడంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. అయితే ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తహశీల్దార్ చెప్పారు. అది డీకేటీ భూమి అని వివరించారు. దీంతో ఇవన్నీ పెద్ద తలనొప్పులుగా మారుతున్నాయి సర్కారుకి.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఎమ్మార్వో ఆఫీసులోకి పెట్రోల్ బాటిల్ తో మరో వ్యక్తి షాకైన అధికారులు appeared first on Telugu Messenger.