అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం అయిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయారెడ్డి హత్యకు సంబంధించి, భూ వివాదం గురించి గౌరెల్లి గ్రామ రైతు, పెద్ద అంబర్‌పేటకు చెందిన ప్రజా ప్రతినిధికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణలో కొందరు నేతల పేర్లు, ఎమ్మెల్యే పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పట్టాలు ఇప్పిస్తానంటూ సదరు ఎమ్మెల్యే రైతుల దగ్గర నుంచి రూ.30 లక్షలు తీసుకున్నట్లు ఆ రైతు నాయకునితో ప్రస్తావించాడు. ఆ ముప్పై లక్షల్లో సురేష్ కుటుంబ సభ్యులవి రూ.3 లక్షల వరకు ఉండొచ్చని రైతు పేర్కొన్నాడు. అసలేంది భూమి పంచాయితీ అని అడగగా.. అది ఇప్పటిది కాదన్నా..! మా తాతల ముత్తాల కాంచి నడుస్తున్న పంచాయితీ. రజాకార్లప్పుడు కొన్న భూమి అది. మా తాతలు, ముత్తాతల నుంచి ఆ గొడవ నడుస్తోంది అన్నాడు. మొత్తం 450 ఎకరాల భూమి అది. 1950 నుంచి భూములకు ఎప్పుడైతే పట్టాలు ఇస్తున్నారో అప్పటి నుంచి నడుస్తున్న పంచాయతీలు అవి అని చెప్పాడు సదను నేత.

నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏ గవర్నమెంటోడు ఉంటే.. ఆ గవర్నమెంటుతో పలుకుబడి ఉన్నోడు ఆ భూమి నాది, ఈ భూమి మీది అన్నట్లుగా కేసులు నడిపిస్తున్నారు .మరి ఆ భూమి కొన్నప్పుడు పేర్లు మారలేదా..?అని నాయకుడు అడగగా.. మారినవి, మారుకుంటూ వస్తున్నాయి, పాస్‌బుక్‌లు కూడా వచ్చాయి. టెనెంట్ కేసులు ఉన్నాయ్, టెనెంట్లకు కూడా పాసుబుక్‌లు వచ్చాయి. ఏ గవర్నమెంట్ వస్తే.. ఆ గవర్నమెంట్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమి నాది అని వస్తారు. లంచాలు తిని ఇలా చేస్తున్నారు అన్నాడు. అందుకు ఆ నాయకుడు మాట్లాడుతూ సేమ్ పెద్ద అంబర్‌పేటలో కూడా ఇదే కేసు ఉంది. మొత్తం 402 ఎకరాలు. సేమ్ ప్రాబ్లమ్. దానిమీద ధర్నా కూడా చేశాం, పేపర్లో, టీవీల్లో కూడా వచ్చింది. రైతులు 1955లో కొనుక్కున్నారు. కొనుక్కున్న రైతులు ఆ తర్వాత మాకు తెలియకుండా ఓఆర్సీలు ఎలా ఇస్తారని కేసులు పెట్టారు. ఇప్పుడు అది కూడా హైకోర్టులో నడుస్తోంది. కొనుక్కున్న రైతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మీ ఊరోళ్లు మా ఊరోళ్లు కలిసి కొట్లాడదాం’ అంటూ మాట్లాడిన ఆడియోటేపు సోషల్‌మీడియాలో కలకలం సృష్టిస్తోంది.
ఈ క్రింద వీడియో చూడండి
ఈ ఆడియో టేప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కాగా, గౌరెల్లి భూముల విషయంలో తనకు ప్రమేయముందనడాన్ని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. సురేష్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. దీంతో ఇది సర్కారుకి పెద్ద సవాల్ గా మారింది, దీనిపై పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు, సివిల్ తగాదాలు కోర్టు భూములు కేసులు వ్యవహరాలలో పోలీసులు రాజకీయ నేతల జోక్యాలు తగ్గకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయి అంటున్నారు ప్రజలు.
ఈ క్రింద వీడియో చూడండి
The post తహశీల్దారు విజయారెడ్డిని ఎవరు చంపారు ఎమ్మెల్యేనా? రైతా? వెలుగులోకి కుట్ర కోణాలు appeared first on Telugu Messenger.