తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోంది. 70 శాతం గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సంరక్షణలోనే నిందితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఛాతీ, కాళ్లు, చేతులు, ముఖం తీవ్రంగా కాలినట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే 72 గంటలు గడవడంతో స్కిన్‌బర్న్.. సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. అప్పుడు పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సురేశ్ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దారు విజయారెడ్డిని రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.. అయితే సురేష్ కూడా కన్నుమూశారు అని వార్తలు వచ్చాయి. కాని దీనిని ఖండించారు డాక్టర్లు. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని, అంతే తప్ప అతను కన్నుమూయలేదు అని క్లారిటీ ఇచ్చారు.

ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. భూ వివాదం వల్లనే సురేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. ఎవరైనా ప్రేరేపిస్తే సురేశ్ ఈ హత్య చేశారా లేదంటే తనకు తానే చేశారా అన్నది విచారిస్తున్నామని చెప్పారు.
ఈ క్రింద వీడియో చూడండి
ఇక సురేష్ చెప్పిన వాంగ్మూలం ప్రకారం తన భూమి తనకు రాకుండా పోతుంది అనే భయం తనకు వెంటాడిందని, అందుకే ఆమె నా మాట వినడం లేదని పెట్రోల్ పోశానని చెప్పాడు, అంతేకాదు తను కూడా చనిపోవాలని అనుకున్నాడట, కాని ప్రాణాలతో బయటపడ్డా అని చెప్పాడు సురేష్. అయితే కోర్టు కేసులో భూమి ఉంది దీనికి మేమే సాయం చేయలేము అని ఎమ్మార్వో చెప్పారు. కాని సురేష్ గత సంవత్సరంగా ఈ భూమి కోసం పోరాటం చేస్తున్నాడట, పలు సార్లు ఆమెని కలిసినా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు అని తెలుస్తోంది. దీంతో రెవెన్యూ ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. కాని ఈ దారుణమైన సంఘటనలో ఎమ్మార్వోతో పాటు ఆమె కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ క్రింద వీడియో చూడండి
The post చావుబతుకుల మధ్య పోలీసులకు అసలు నిజాలు చెప్పిన సురేష్ appeared first on Telugu Messenger.