మీకు రోడ్డు మీద ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి పోలీసులు చెబుతారు. అయినా కానీ వినరు. ఏదైనా బాక్స్ కనపడితే చాలు వెంటనే దానిని ఓపెన్ చేసి అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటారు. అందులో డబ్బు ఉందొ లేక వేరే ఏదైనా ఖరీదైనది ఉందొ అని ఆశతో జనాలు పోలీసులకు సమాచారం ఇవ్వరు. అలా ఆశపడే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. చెత్తకుప్పలో దొరికిన డబ్బాలో ఏముందో అనే ఆత్రుతతో మూత తెరవడానికి ప్రయత్నిస్తే అది పేలింది.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఉదయం చెత్త ఏరుకుంటున్న నిర్మల్ అనే మహిళకు స్టీల్ డబ్బా దొరికింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బాను నేలపై బలంగా కొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఆ బాక్స్ పేలిపోయింది. అందులోని మేకులు, గాజుపెంకులు గుచ్చకోవడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. ఆ డబ్బాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ డబ్బా ఎవరైనా కావాలనే ఇక్కడ పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రింద వీడియో చూడండి
క్లూస్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరిస్తున్నారు. పలువురు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలు చెందవద్దని పోలీసులు భరోసా ఇస్తున్నారు. టిఫిన్ బాక్స్ లో బాంబ్ ఎలా వచ్చింది అనేది సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొద్ది నెలల క్రితం రాజేంద్రనగర్‌లో కూడా ఓ వ్యక్తి చెత్తకుప్పలో దొరికిన వస్తువును పగులగొట్టడంతో అది పేలిపోయింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. మరోసారి అలాంటి ఘటనే జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చూశారుగా ఎంత ఘోరం జరిగిందో..కాబట్టి ఇలాంటి బాక్స్ లు ఏమైనా కనపడితే పోలీసులకు ఇన్ఫార్మ్ ఇవ్వండి..
The post చెత్తకుప్పలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన హైదరాబాద్ appeared first on Telugu Messenger.