Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఎమ్మార్వో హత్య తర్వాత కారు దగ్గర సురేష్.. అందులో ఉన్నదెవరో తెలిస్తే షాక్

$
0
0

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో హత్య కేసు మిస్టరీ పోలీసులకు మరింత సవాల్ గా మారింది. ఎమ్మార్వోను హత్యచేయడానికి నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా? ఎవరున్నారు? అనేది తెలుసుకోవడం మరింత జటిలమైంది. నిందితుడి మొబైల్ కీలకంగా మారడంతో కాల్‌డేటా ఆధారంగా మరికొందర్ని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. నవంబరు 4న ఘటన జరిగిన తర్వాత 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చేరిన సురేష్ కొద్ది గంటల వరకు డాక్టర్లతో మాట్లాడాడు. అతడి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ రికార్డ్ చేసే సమయానికి పోలీసులు అక్కడ లేరు.

Image result for tahsildar vijaya reddy

అయితే, అదే రోజు సాయంత్రం నుంచి సురేష్‌ మెల్లమెల్లగా సెమీ కోమా స్థితికి చేరుకోగా ఎవరైనా గట్టిగా పలకరిస్తే ఊ కొట్టడం తప్ప మాట్లాడలేదు. సురేష్‌కు 65 శాతం గాయాలు కావడంతో అతడికి చూపు పూర్తిగా పోయిందని డాక్టర్లు తెలిపారు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతోనే తీవ్ర ఆవేదన చెందిన సురేష్.. ఈ ఘటనకు పాల్పడినట్లు అతని మాటలను బట్టి అర్థమైందని ఉస్మానియా వైద్యులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. నిందితుడు సురేష్‌ చనిపోయినా కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు. సురేశ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అందజేయాలని మేజిస్ట్రేట్‌ను పోలీసులు కోరారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన తర్వాత అక్కడ నుంచి పారిపోవాలనుకున్న సురేష్.. తనకూ గాయాలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే లొంగిపోయాడా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎమ్మార్వో ఆఫీసు సమీపంలో వైన్ షాప్ వద్ద కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడిన తర్వాతే తన వ్యూహాన్ని మార్చుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.విజయారెడ్డికి నిప్పంటించి బయటకు వచ్చిన సురేష్‌ తన ఒంటిపై దుస్తులను తొలగించుకుంటూ వైన్ షాప్ ఎదురుగా ఉన్న కారు దగ్గరికెళ్లి, అందులోని వ్యక్తులతో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి పరుగెత్తాడు. 65 శాతం గాయాలు కావడంతో తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితితోపాటు ఘటనపై పోలీసులు అలర్ట్ కావడంతో లొంగిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, నేరుగా హాస్పిటల్‌కు వెళ్తే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని కారులోని వ్యక్తులు సురేష్‌కు చెప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Image result for tahsildar vijaya reddy

సురేష్‌ పరుగు లంకించుకోగానే ఆ కారు అక్కడే ఉందా.. ఎటైనా వెళ్లిందా అనే అనుమానంతో సమీపంలోని సీసీ ఫుటేజీని పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో ఆఫీసుకు సురేష్‌ స్వగ్రామం గౌరెల్లి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆటో, బస్సుల్లో వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో కారులోనే పెట్రోలు డబ్బాతో వచ్చిఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వైన్ షాప్ ముందు నిలిచి ఉన్న కారు అదేనేమోనని సంశయిస్తున్నారు.విచారణలో తేలాల్సి ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

The post ఎమ్మార్వో హత్య తర్వాత కారు దగ్గర సురేష్.. అందులో ఉన్నదెవరో తెలిస్తే షాక్ appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles