మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎద్దు కు ఎరుపు రంగు చూస్తే వెర్రిక్కి పోయి పొడవడానికి మీదకు వస్తుంది అని.అయితే ఎద్దుకు ఎరుపు రంగు చూస్తేనే కాదు పదే పదే హార్న్ కొట్టినా కోపం కట్టలు తెంచుకు వస్తుంది అని తాజాగా జరిగిన ఒక ఘటన ద్వారా తెలుస్తుంది. ట్రాఫిక్ లో మన వెనుక ఎవరన్నా ఊరికే ఆగకుండా హారన్ కొడితే మనకు ఎక్కడో కాలుతుంది. అయితే, ఏమీ చేయలేక మనం గమ్మున ఉంటాం. లోపల్లోపల తిట్టుకుంటూ. కానీ అది అసలే ఎద్దు.. అప్పటికే దానికి ఏదో అయినట్టు ఉంది. రోడ్డుమీద వెళుతుంటే ఓ కారు డ్రైవర్ దాన్ని తప్పుకోమని హారన్ కొట్టాడు. ఇంకేముంది దానికి మరింత మంట ఎక్కినట్టుంది. ఇక ఒక్కసారిగా వెనక్కితిరిగి కారును కుమ్మడం మొదలు పెట్టింది. కుమ్మడం అంటే అలా ఇలా కాదు.. కొమ్ములతో దాదాపు ఆ కారు తిరగబడిపోయే స్థితికి వెళ్లేట్టుగా కుమ్మేసింది.

బీహార్ లోన్ హాజీ పూర్ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటుగా ఎద్దు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఒకటి పదే పదే హార్న్ కొట్టడం తో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో భీకరంగా అరుస్తూ పలు వాహనాలపై దాడికి దిగి భీభత్సం సృష్టించింది. దాని కోపాన్ని ఎవరూ పట్టలేకపోయారు. పదే పదే హార్న్ కొట్టారన్న ఒక్క కారణంగా అది ప్రవర్తించిన తీరు చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పట్టరాని కోపంతో భీకరంగా అరుస్తూ ఇతర వాహనాలపై దాడికి దిగింది. అదేదో సినిమాలో దెయ్యం పట్టిన వారు బిహేవ్ చేసినట్లు ఒక్కసారిగా ఎద్దు ప్రవర్తన చూసి అక్కడ ఉన్నవాళ్లు కూడా భయపడిపోయారు. కోపంతో ఊగిపోయిన ఆ ఎద్దు కారును గాల్లోకి లేపి తన కోపాన్ని తీర్చుకుంది.
ఈ క్రింద వీడియో చూడండి
అయితే ఆ సమయంలో కారులో డ్రైవర్ ఉన్నప్పటికీ ఎద్దు కారుపై దాడి చేయగానే అతడు బయటకు పారిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోపక్క ఆ ఎద్దుకు శాంతింపజేయడానికి స్థానికులు రాళ్లు విసురుతూ, నీళ్లు చల్లుతూ కారును విడిచిపెట్టేలా చేశారు. కోపం వచ్చిన ఆ ఎద్దు తన కొమ్ములతో వాహనాలపై దాడికి దిగడంతో స్థానికులు అందరూ కూడా మనుషుల మీద కూడా దాడికి దిగితే ఏంటా పరిస్థితి అని ఆందోళన చెందారు. అలాఇలా కష్టపడి కాసేపటికి శాంతించిన ఆ ఎద్దు తన దారిన అది వెళ్ళిపోయింది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మొత్తానికి ఎద్దుకు కోపం వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం ఈ ఘటనతో అర్ధం అవుతుంది.
ఈ క్రింద వీడియో చూడండి
The post కారు డ్రైవర్ మీద కోపంతో ఈ ఎద్దు చేసిన పనికి దిమ్మతిరుగుతుంది.. appeared first on Telugu Messenger.