శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశం నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్దం చేసింది. అయితే, కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్ యంగ్ లాయర్స్ అసోషియేషన్ 2006లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వారు వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు.. 2018 సెప్టెంబరు 28న తీర్పును వెలువరించింది. స్త్రీ పురుషుల వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని.. ఇది మహిళల హక్కులకు విఘాతం కల్పిస్తుందని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది.

ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు మహిళలకు అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే, ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం దీనిని వ్యతిరేకించారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలున్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పుతో కేరళ సహా దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలు చేసిన ప్రయత్నాలను అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. కేరళ ప్రభుత్వ చర్యలను కూడా భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును పునఃసమీక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో సుప్రీంకోర్టు రివ్వూ పిటిషన్లకు అనుమతించింది. మొత్తం 64 మంది వేర్వేరుగా రివ్వూ పిటిషన్లు దాఖలు చేయగా ఫిబ్రవరి 6 వాదనలు ముగిసాయి. గురువారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది రివ్యూతోపాటు అనేక పిటిషన్లు తమ ముందుకు వచ్చినట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని ఈ సందర్భంగా జస్టిస్ గొగొయ్ వ్యాఖ్యానించారు.ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై ఒకే మతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ వివాదం శబరిమల ఆలయానికే పరిమితం కాలేదని అన్నారు..
ఈ క్రింద వీడియో చూడండి
మెజార్టీ సభ్యుల తీర్పుతో విబేధించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నారిమన్.. దీంతో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీచేస్తూ ధర్మాసనం నిర్ణయం. దీంతో ఈ కేసు మరోసారి విచారణకు ముందుకు వస్తోంది. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీం తీర్పును అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్ధానం బోర్డు ప్రకటించాయి.. అలాగే తీర్పుపై కూడా ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ కేసు గురించి మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ జరుగనుంది, ఫైనల్ గా ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై తుది తీర్పు వెల్లడించనుంది.
ఈ క్రింద వీడియో చూడండి
The post శబరిమలపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్ appeared first on Telugu Messenger.