Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

కన్న తల్లిపై చేయి చేసుకున్న కొడుకు.. ఆ తల్లి పోలీసులతో ఏం చెప్పిందో తెలిస్తే షాక్

$
0
0

మహ మహ రుషులు కూడా మాత్రుమూర్తిని దైవంగా భావిస్తారు, ఎందరో ఉత్తమ పురుషులు రుషులు పుట్టిన మన భారత దేశంలో ఎన్ని మతాలు కులాలు ఉన్నా అందరూ తల్లిని ఒకేలా చూస్తారు. దైవస్వరూపంగానే భావిస్తారు. నవమాసాలు మోసి మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన అమ్మని జీవితాంతం బాగా చూసుకోవాలని భావిస్తాం.. కాని కొందరు కర్కసంగా తల్లులని అవమానకరంగా హింసిస్తారు, చివరి రోజుల్లో తిండిపెట్టక పస్తులు ఉంచే దుర్మార్గులు కూడా ఇప్పుడు మన సమాజంలో ఉన్నారు, తనకు ఆకలి అంటే తన కడుపు మాడ్చుకుని పిల్లల ఆకలి తీర్చే తల్లిని చివరి రోజుల్లో అభాగ్యురాలిగా వదిలేస్తున్నారు. నాలుగు మెతుకుల కోసం నాలుగు వీధులు తిరుగుతున్న తల్లులు ఎందరో ఉన్నారు.

కన్న తల్లిపై చేయి చేసుకున్న కొడుకు.. ఆ తల్లి పోలీసులతో ఏం చెప్పిందో తెలిస్తే గుండె తరుక్కు పోవడం ఖాయం-Video Of Boy Beating Mother Prompts Bengaluru Police To Take Action-

సమాజంలో మార్పులు కూడా పిల్లలలో విధ్వేషాలను తీసుకువచ్చాయి…ఒకప్పుడు కన్న తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉండేది.తల్లితండ్రులకు పిల్లలు భయపడటంతో పాటు, తల్లిదండ్రులు ఏం చెబితే అదే వేద వాక్కు అన్నట్లుగా ఉండే వారు.కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది.అందరు పిల్లలు ఒకేలా ఉంటారని చెప్పడం లేదు, కాని ఎక్కువ శాతం మంది పిల్లలు ముఖ్యంగా టీనేజర్స్‌ మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.తల్లిదండ్రుల మాట వినకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తే తిరిగి తల్లిదండ్రులపై దాడి చేసే పిల్లలు తయారు అవుతున్నారు..

కర్ణాటక కృష్ణరాజపురంకు చెందిన జీవన్‌ అనే 17 ఏళ్ల కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు.కాలేజ్‌కు పోకుండా స్నేహితులు, పార్టీలు అంటూ తాగుడుకు బానిస అయ్యాడు.ఇంట్లో బలవంతంగా డబ్బులు తీసుకు వెళ్లడం, ఇవ్వకపోతే గొడవ చేయడం చేస్తూ ఉండేవాడు. ఇంటో వారు ఎంతగా అతడికి నచ్చజెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది.ఇతగాడికి ఒక లవర్‌ కూడా ఉంది.ఆమె కోసం ఈయన చేసే ఖర్చులు అంతా ఇంతా కావు.ఏకంగా లవర్‌ను ఇంటికి తీసుకు వచ్చి, ఆమె తన సర్వస్వం అన్నట్లుగా చెప్పేశాడు.

ఈ క్రింద వీడియో చూడండి

కొడుకు చదువు పక్కన పెట్టి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నాడని తల్లి రోజు బాధపడేది.తాజాగా ఒక రోజు కొడుకును తీవ్రంగా మందలించింది.చేయి కూడా చేసుకునేందుకు ప్రయత్నించింది.దాంతో తీవ్రంగా కోపోద్రిక్తుడు అయిన జీవన్‌ తల్లిపై ఎదురు తిరిగాడు.ఇతర కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తల్లిపై దాడి చేశాడు.చేతికి ఏది దొరికితే దాంతో తల్లిని చితకొట్టాడు.చీపురు కట్టతో తల్లిని కొడుతున్న సందర్బంగా ఇతర కుటుంబ దాన్ని వీడియో తీశారు.ఆ వీడియో కాస్త వైరల్‌ అవ్వడం, జీవన్‌పై పోలీసు కేసు నమోదు అవ్వడం జరిగింది.పోలీసులు జీవన్‌ను అరెస్ట్‌ చేసి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.తన కొడుకు బాగా చెడిపోతున్నాడని, కొన్నాళ్లు అతడిని జైల్లో ఉంచాలని స్వయంగా ఆ తల్లి కోరింది.జీవన్‌ వంటి వారు ఎంతో మంది యువత చాలా దారుణంగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు.అలాంటి వారు జీవితంలో విఫలం అవుతారు.తల్లిదండ్రుల మాటలు వినని వారు దేనికి పనికిరాకుండా పోతారు. మరి జీవన్ లాంటి వ్యక్తులు సొసైటీలో ఉన్నారు అలాంటి వారు మీకు కనిపిస్తే వారిలో మార్పు కోసం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి.

ఈ క్రింద వీడియో చూడండి

The post కన్న తల్లిపై చేయి చేసుకున్న కొడుకు.. ఆ తల్లి పోలీసులతో ఏం చెప్పిందో తెలిస్తే షాక్ appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles